8 Popular Tollywood Couples

8 Popular Tollywood Couples

బాగా పాపులర్ అయిన 8 టాలీవుడ్ జంటలు

Best Tollywood Celebrity Couples

తెరపై ఒక హీరో, ఒక హీరోయిన్ పెయిర్ బాగుంటే… ఇక ఆ జంటని పెట్టి అనేక సినిమాలు తెరకెక్కడం మనకు తెలిసిన విషయమే. రీల్ లైఫ్ కపుల్స్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఎంతోమంది హీరోహీరోయిన్లు. ఆ రీల్ లైఫ్ కపుల్స్ కి ప్రేక్షకుల్లో తెగ క్రేజు ఉంది. అయితే, ఈ నాడు మేము ఈ వీడియోలో టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్స్ గురించి చెప్పబోతున్నాము. మేము చెప్పే ఈ జాబితాలో కొంతమంది తెరపై కూడా కపుల్స్ గా చేసినవారే. అయితే కొంతమంది మాత్రం అలా చేయకపోయినా వారూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 

1. నాగార్జున – అమల:
తెలుగు చిత్ర పరిశ్రమలో చూడగానే చూడముచ్చటగా ఉండే జంట ‘నాగార్జున – అమల’. వీళ్లిద్దరు కలిసి కిరాయి దాదా, చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం తదితర సినిమాలు చేశారు. టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ లో ఒకటి అమల – నాగార్జున జంట. 1992లో వీరి వివాహం జరిగింది. వీరిద్దరి కుమారుడు హీరో అఖిల్ అక్కినేని.

Best Tollywood Celebrity Couples
2. జీవిత – రాజశేఖర్
తెలుగు ప్రేక్షకులు మెచ్చిన మరో నిజ జీవిత జంట జీవిత – రాజశేఖర్. ఈవెంట్స్ కు, ఫంక్షన్స్ కు, ఇంటర్వ్యూలకు వీళ్లిద్దరు కలిసి అటెండ్ అవడం ప్రేక్షకులకు తెలియంది కాదు. ‘తలంబ్రాలు’ సినిమాలో షూటింగ్ సమయం నుంచే వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం మొదలయింది. వీరి వివాహానికి పెద్దల నుంచి అంగీకారం రాలేదు. అయితే ఒకసారి రాజశేఖర్ కి పెద్ద ఆక్సిడెంట్ అయింది. అప్పుడు జీవిత.. రాజశేఖర్ ను ఎంతో జాగ్రత్తగా చూసుకొంది. ఈ ఇన్సిడెంట్ తరువాత వీరి పెద్దలు వీరి పెళ్ళికి పచ్చ జెండా ఊపారు.

Best Tollywood Celebrity Couples
3. మహేష్ బాబు – నమ్రత
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరొక టాలీవుడ్ జంట ‘మహేష్ బాబు – నమ్రత’. మొదటిసారి ‘వంశీ’ సినిమా షూటింగ్ టైంలో వీళ్లిద్దరు కలిశారు. 2005లో వీరి వివాహం జరిగింది. వీళ్ళ పిల్లలు సితార – గౌతమ్ కూడా అభిమానులకు ఎంతో చేరువ అయ్యారు.

Best Tollywood Celebrity Couples
4. శ్రీకాంత్ – ఊహ
శ్రీకాంత్ – ఊహ జంట కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయిన జంటే. వీళ్లిద్దరూ కలిసి ‘కూతురు’, ‘ఆమె’ తదితర సినిమాలల్లో చేశారు. వీరి వివాహం 1997లో జరిగింది. వీళ్లిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి సినిమాలలో నటించాడు.

Best Tollywood Celebrity Couples
5. అల్లు అర్జున్ – స్నేహ
‘ఆర్య’ సినిమాలో ‘ఫీల్ మై లవ్’ అంటూ బ్రహ్మాండంగా నటించిన అల్లు అర్జున్ తన రియల్ లైఫ్ లవ్ ని మాత్రం మొదటిసారి యూఎస్ లో కలిసాడు. తన ఫ్రెండ్ వివాహానికి అటెండ్ అవడానికి యూఎస్ వెళ్ళాడు బన్నీ. ఆ వేడుకలోనే మొదటిసారి స్నేహా రెడ్డిని కలిశాడు. స్నేహని చూసిన మొదటి చూపులోనే తనతో ప్రేమలో పడ్డాడు అల్లు అర్జున్. వీళిద్దరి వివాహం మార్చ్ 2011లో జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

Best Tollywood Celebrity Couples
6. నాని – అంజనా
తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో నాని. నాని భార్య పేరు అంజన. వివాహం కంటే ముందు వీరు ఐదు సంవత్సరాలు డేటింగ్ చేశారు. వీరి వివాహం 2012లో జరిగింది. 2017లో వీరికి ఒక కుమారుడు పుట్టాడు. తమ కుమారుడు ‘అర్జున్’ని ‘జున్ను’ అని ఇష్టంగా పిలుచుకుంటారు నాని – అంజన. సోషల్ మీడియా పుణ్యమా అని నాని – అంజన జంట కూడా అభిమానులకు బాగా దగ్గరయింది.

Best Tollywood Celebrity Couples
7. రాంచరణ్ – ఉపాసన
తెలుగు సినిమా ప్రేక్షకుల దగ్గర బాగా గుర్తింపు పొందిన మరొక టాలీవుడ్ జంట రాంచరణ్ – ఉపాసన. వీరిది కూడా ప్రేమ వివాహమే. వివాహం కంటే ముందు వీరు ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేశారు. సరదా కొట్లాటలతో వీరి పరిచయం మొదలయింది. ఆ తరువాత 2011లో మూడు ముళ్ల బంధంతో వీరు ఒక్కటయ్యారు.

Best Tollywood Celebrity Couples
8. నాగ చైతన్య – సమంత
‘ఏ మాయ చేశావే’ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన నాగచైతన్య – సమంత 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అభిమానులు వీళిద్దరినీ ‘చే సామ్’ అని పిలుస్తారు. 2015 నవంబర్ నుంచి వీళ్లిద్దరు రిలషన్ షిప్ లో ఉన్నారు.
Best Tollywood Celebrity Couples
Also Read: Unknown Facts About King Nagarjuna

Related post

Leave a Reply

Your email address will not be published.