Bahubali Movie Success Secret

Bahubali Movie Success Secret

‘బాహుబలి’ విజయ రహస్యం

Bahubali Success Secret

మన భారత సినిమా పరిశ్రమ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. మన తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి కూడా ‘బాహుబలి’ ఫ్రాంఛైజు తరువాత పెరిగిందనే చెప్పాలి. ఈ సినిమా తెరకెక్కిన తరువాత మన టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడం ఎక్కువయింది. అప్పటివరకు కేవలం తెలుగు ప్రేక్షకులని, ఇతర దక్షిణ భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందిస్తూ ఉండేవారు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్. కానీ ‘బాహుబలి’ సినిమా తరువాత సీన్ మారింది. చేపడితే పాన్ ఇండియా మూవీనే చేపట్టాలి అన్న రీతిలో తయారయింది సినిమా వాళ్ళ పరిస్థితి. ఇలా టాలీవుడ్ లో సీన్ మార్చిన ఘనత ‘బాహుబలి’కే దక్కింది. నిర్మాతలకు లాభాలు, నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చిన ‘బాహుబలి’ ఫిల్మ్ మేకర్స్ ఆలోచనా ధోరణిని కూడా మార్చేసింది. అయితే, ఈ క్రెడిట్ అంతా ‘బాహుబలి’ వెనుక ఉన్న వారికే దక్కుతుంది. 

1. ఎస్.ఎస్.రాజమౌళి:
బాహుబలి చిత్రాలను ‘జక్కన్న’ రాజమౌళి ఎంత చెక్కగా తెరకెక్కించారో మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ‘బాహుబలి’ చిత్రాలను చూసిన వారికి రాజమౌళి ఈ సినిమా కోసం తన ముందు సినిమాలకు కన్నా ఎక్కువ కష్టపడ్డాడని అర్ధమవుతుంది. యావత్ భారత దేశపు దృష్టే కాదు అంతర్జాతీయంగా కూడా ‘బాహుబలి’ బాగా గుర్తింపు పొందిందంటే… ఈ సినిమాల సృష్టికర్త ‘రాజమౌళి’ హార్డ్ వర్క్ యే ప్రధాన కారణం. ఈ సినిమా భారీ విజయం అందుకోవడానికి రాజమౌళి ఏడేళ్లకు పైగానే కష్టపడ్డాడు. ‘బాహుబలి’ చిత్రాలకు బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ లో ఓ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఐఫా ఉత్సవం బెస్ట్ డైరెక్టర్ పురస్కారం కూడా అందుకున్నాడు జక్కన్న. ఇంకా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా బెస్ట్ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకున్నాడు.

Bahubali Success Secret2. ఎం.ఎం. కీరవాణి:
‘బాహుబలి’ చిత్రాలకు సంగీతాన్ని అందించింది ఎం.ఎం.కీరవాణి. శ్రోతల నాడి పట్టుకొన్న కీరవాణి సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్టే. తన స్టైల్ లో సాంగ్స్ ని కంపోజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే కీరవాణి ఈ సినిమాతో కూడా మరోసారి అదే పని చేశాడు. ‘బాహుబలి’ సినిమాలు విజయం సాధించడంలో కీరవాణి ఎంతో కష్టపడ్డాడు. సినిమాకు సంగీతం ఎలా ఉండాలో సరిగ్గా అలాగే సమకూర్చి ప్రేక్షకులకు సినిమాని మరింత చేరువ చేయడంలో తన వంతు కృషి చేశాడు కీరవాణి. కీరవాణి పాడిన ‘బాహుబలి 1’లో ‘శివుని ఆన’, ‘నిప్పులే శ్వాసగా’ పాటలు ‘బాహుబలి 2’లో ‘సాహోరే బాహుబలి’ హిట్ సాంగ్స్ గా నిలిచాయి.

Bahubali Success Secret3. విజయేంద్రప్రసాద్:
‘బాహుబలి’ చిత్రాలకు స్క్రిప్ట్ ని అందించింది విజయేంద్రప్రసాద్. ‘బాహుబలి 1’ తరువాత విజయేంద్రప్రసాద్… ‘భజ్రంగీ భైజాన్’, సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 2019లో ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించాడు విజయేంద్రప్రసాద్. ఇందులో కంగనా రానౌట్ టైటిల్ రోల్ పోషించింది. ‘బాహుబలి’ చిత్రాల తరువాతే బాలీవుడ్ లో కూడా పని చేశాడు విజయేంద్రప్రసాద్.

Bahubali Success Secret4. శోబు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని:
‘బాహుబలి’ సినిమాలను నిర్మించిన నిర్మాతలు. ‘బాహుబలి’ వంటి దృశ్య కావ్యాన్ని ఇచ్చినందుకు వీరికి భారత సినిమా ప్రపంచం… కృతఙ్ఞతలు చెప్పాలి. ‘బాహుబలి’ టీం పట్ల వీరు ఎంతో నమ్మకముంచి సినిమాని అత్యంత భారీగా తెరకెక్కించేందుకు ముందుకు వచ్చారు. వీరి సహాయం లేనిదే ‘బాహుబలి’ ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. వీరికి సింప్లిసిటీ ఎక్కువని, అటువంటి నిర్మాతలను టాలీవుడ్ లో చూడలేదని కూడా ‘బాహుబలి’ టీం ఇంటర్వ్యూలలో చెప్పింది.

Bahubali Success Secret5. రమారాజమౌళి:
‘బాహుబలి’ సినిమాలకు రమారాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. తెరపై ప్రతీ ఆర్టిస్ట్ ఆకర్షణీయంగా కనిపించేటట్టు చేయడంలో రమారాజమౌళి ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ ప్రాజెక్టులో, నటీనటుల కాస్ట్యూమ్స్ ని రామా డిజైన్ చేసింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాల్లో పాత్రకు తగట్టు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడమంటే నిజంగా అది కష్టమైన పనే.

Bahubali Success Secret6. పీటర్ హెయిన్స్:
ఈ సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్ల జాబితాలో పీటర్ హెయిన్స్ పేరు కూడా చెప్పాలి. తన సృజనాత్మకతతో అత్యంత అద్భుతంగా స్టంట్లను డైరెక్ట్ చేసి వీక్షకులను ఆకర్షించాడు పీటర్. టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలకు పీటర్ ఎక్కువగా వర్క్ చేశాడు.

Bahubali Success Secret7. సాబు సిరిల్:
‘బాహుబలి’కి సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశాడు. తన వంతు కృషి చేసి ‘బాహుబలి’ విజయానికి ఎంతో కష్టపడ్డాడు. ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా ఈ సినిమాని ప్రేక్షకులకు నచ్చినట్టు తీర్చిదిద్దడంలో అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురుకున్నాడు సాబు సిరిల్. సినిమాల్లో కనిపించే ఎంటైర్ ఆర్ట్ వర్క్ మరియు సెట్లు సాబు సిరిల్ ఆలోచనల నుంచి వచ్చినవే.

Bahubali Success Secret

Also Read: Unknown Facts About King Nagarjuna

Related post

Leave a Reply

Your email address will not be published.