
Close Friends In Tollywood
టాలీవుడ్ క్లోజ్ ఫ్రెండ్స్
Best Friends In Telugu Film Industry
మంచి స్నేహితులు ఎప్పుడు మన బాధను తగ్గించి మనల్ని సంతోషపరుస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు స్నేహం అంటే ఇలా ఉండాలన్న రీతిలో రూపొందించబడ్డాయి. తెలుగులో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరకెక్కి అవి విజయవంతమయ్యాయి కూడా. సినిమాల మాట పక్కన పెడితే…. మన టాలీవుడ్ సెలెబ్రిటీల నిజ జీవిత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? ఆ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చిత్రపరిశ్రమకే చెందినవారైతే? వింటేనే తెలుసుకోవాలన్న ఆతృతగా ఉంది కదూ!
- చిరు, నాగ్:
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మధ్య మంచి స్నేహం ఉంది. పెద్ద నటులుగా ఉన్న వీరు ఒకరిపై ఒకరు ఎంతో గౌరవంగా ఉంటారు. వీరిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకోవడం ఇప్పటికే ఎన్నో షోల ద్వారా అభిమానులు చూసే ఉంటారు. ఓ రియాలిటీ షోకి చెందిన రెండు సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ రెండు సీజన్స్ ఫైనల్స్ కి చిరంజీవి అతిథిగా వచ్చారు. ఆ సమయంలో చిరు, నాగ్ ఎంతో సరదాగా మాట్లాడుకుని ప్రేక్షకులను ఆనందింపజేశారు. ఒకరితో ఒకరికి క్లోజ్ నెస్ ఉండడం వల్లనే అలా మాట్లాడుకోగలిగారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
- రానా, చెర్రీ:
రానా, చెర్రీ మధ్య కూడా మంచి స్నేహమే ఉందండోయ్. ఆ స్నేహం కూడా మామూలు స్నేహం కాదు. చిన్ననాటి స్నేహం. వీరిద్దరూ కలిస్తే ఇక అల్లరే అల్లరి. చెన్నైలో వీరు నైన్త్ స్టాండర్డ్ వరకు ఒకే స్కూల్ లో చదివారు. ఆ తరువాత హైదరాబాద్ లో వారి చదువుని కొనసాగించారు. చిన్నప్పటి స్నేహాన్ని, పెద్దయ్యి పరిశ్రమలో పెద్ద స్టార్స్ అయిన తరువాత కూడా కంటిన్యూ చేయడమంటే అది నిజంగా మామూలు విషయం కాదు కదా. ఇదిలా ఉంటే, రాంచరణ్ భార్య ఉపాసనా, అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా రాంచరణ్, రానా చదివిన స్కూల్ లోనే చదివారట.
- పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్:
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ ఎంత బ్లాక్ బస్టరో తెలియంది కాదు. వీళ్లిద్దరు కలిసి ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలకు వర్క్ చేశారు. పవన్ తో స్నేహం కారణంగా త్రివిక్రమ్ ‘తీన్మార్’కి మాటలు రాశాడు. అలాగే ఆ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించాడు. దీని బట్టే తెలుసుకోవచ్చు, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య ఎంత స్నేహం ఉందో. అందుకే కాబోలు వీళిద్దరి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా అభిమానులు ఇంకా ఆ కాంబినేషన్ ని కోరుకుంటూనే ఉంటారు.
- జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల:
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల నిజ జీవితంలో మంచి స్నేహితులు. వీళ్లిద్దరు ఒకరితో ఒకరు సుఖ దుఃఖాలు పంచుకుంటారట. వీళ్ళ స్నేహ బంధం ఇరవై సంవత్సరాల పైనాటిదే. వీళ్లిద్దరూ కలిస్తే సినిమా గురించి, పాత్రల గురించి, ఇంకా అనేక విషయాల గురించి సరదాగా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారట.
- పూరీ జగన్నాథ్, రవితేజ:
మాస్ మహారాజ్ రవితేజ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు వర్క్ చేశారు. ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘నేనింతే’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలకు వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేశారు. ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్, రవితేజాది కూడా హిట్ కాంబినేషనే.
- నితిన్, అఖిల్ అక్కినేని:
అఖిల్ అక్కినేని, నితిన్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సంగతి ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ మధ్య నాగ్ హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి వచ్చిన నితిన్… ఓ ప్రశ్నకి హెల్ప్ కావాల్సినప్పుడు అఖిల్ కి ఫోన్ చేశాడు. దాంతో, అప్పటి నుంచి నితిన్, అఖిల్ అక్కినేని మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సంగతి బయట అభిమానులకు కూడా తెలిసింది. ఇదిలా ఉంటే, అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ చిత్రాన్ని నితిన్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా తెరకెక్కుతోన్న సమయంలో కూడా నితిన్, అఖిల్ బయటకు వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయడం వంటివి చేశారట.
- రాంచరణ్, శర్వానంద్:
టాలీవుడ్ లో కూల్ గా కనిపించే హీరో రాంచరణ్. రాంచరణ్, శర్వానంద్ ల మధ్య కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ ఏడాది శర్వానంద్ పుట్టినరోజున స్వయంగా రాంచరణ్ ఓ పార్టీని కూడా నిర్వహించాడు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. వైరల్ అయిన ఆ పిక్ లో శర్వానంద్ కేక్ ని కట్ చేస్తున్నాడు. ఆ కేక్ ని రాంచరణ్ పట్టుకున్నాడు. ఆ పిక్ లో రాంచరణ్ తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. మొత్తం మీద ఈ పిక్ తో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన చెర్రీ, శర్వానంద్ ల క్లోజ్ ఫ్రెండ్ షిప్ మరోసారి రివీల్ అయింది.
8.ప్రభాస్, అనుష్క:
ప్రభాస్, అనుష్క పెయిర్ ఇండస్ట్రీలో ఎంతో పెద్ద హిట్. ఈ జోడీ కలిస్తే ఎంతో క్యూట్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరూ బీట్ చేయలేనటువంటి పొజిషన్స్కి ఇద్దరూ చేరుకున్నారు. వీళ్లిద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్. వీళ్లపై ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చినా… అవన్నీ కేవలం పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు ఈ స్టార్లు. వీరి స్నేహం ఎంతో మందికి స్ఫూర్తి కలిగించింది కూడా. అభిమానులకు నిజమైన స్నేహం అంటే ఏమిటో వీరి స్నేహం చూపిస్తోంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
- శృతి హాసన్, తమన్నా:
శృతి హాసన్, తమన్నా మధ్య ఫ్రెండ్ షిప్ కొన్ని సంవత్సరాలది. వీళ్లిద్దరూ కలిసి 2021 నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకున్నారు. అప్పుడు తీసుకొన్న ఫోటోలను సైతం శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అనేక ఇంటర్వ్యూలలో శృతి హాసన్, తమన్నా తమ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చారు.