
Co-Stars In Tollywood Become Couples
సెలెబ్రెటీల ప్రేమకు దారితీసిన టాలీవుడ్
Tollywood Real life Couples
తెలుగు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన అందమైన జంటలు ఎన్నో. అయితే, వారిలో కొంతమంది రీల్ కపుల్స్ నుంచి రియల్ కపుల్స్ గా మారిపోయారు. వెండితెరపై ఆ జంటలను ప్రేక్షకులు ఎలా ఆదరించారో నిజజీవితంలో కూడా కొంతమంది సినిమా రియల్ జంటలపై ప్రేక్షకుల ఆదరణే అలాగే ఉండడం విశేషం.
1. అక్కినేని నాగార్జున, అమల:
1992లో మూడుముళ్ళు ద్వారా ఒక్కటయ్యారు అక్కినేని నాగార్జున, అమల. అప్పటికే నాగ్, అమల తెలుగు సినిమా పరిశ్రమలో వెల్ ఎస్టాబ్లిష్డ్ సెలెబ్రిటీలుగా ఉన్నారు. తెలుగులో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు వీరు. టాలీవుడ్ కింగ్ నాగార్జునను, అమలను చూసినవారు తప్పకుండా ఈ జంట ‘మేడ్ ఇన్ హెవెన్’ అని అనాల్సిందే. వివాహానంతరం కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు అమల. అయితే, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఒక కీలకమైన సపోర్టింగ్ పాత్రతో తిరిగి తెరపై కనిపించారు. అలాగే ‘మనం’ సినిమాలో ఓ అతిథి పాత్రలో తళుక్కుమన్నారు. మొత్తానికి నాగార్జునకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో నాగార్జున, అమల జంటకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు.
2. రాజశేఖర్, జీవిత:
‘ఆహుతి’, ‘తలంబ్రాలు’, ‘ఓంకారం’ సినిమాలతో టాలీవుడ్ లో వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టార్ గా గుర్తింపు పొందారు రాజశేఖర్. ఇక జీవిత విషయానికొస్తే, ఎన్నో తెలుగు, తమిళ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. జీవిత, రాజశేఖర్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవితను రాజశేఖర్ వివాహమాడడం మొదట రాజశేఖర్ తల్లికి ఇష్టం లేదు. కానీ ఆ తరువాత ఆవిడ కూడా వీరి పెళ్ళికి పచ్చా జెండా ఊపేశారు. అలా, రీల్ కపుల్ గా నటించిన రాజశేఖర్, జీవిత రియల్ కపుల్ గా మారారు.
3. శ్రీకాంత్, ఊహ:
టాలీవుడ్ లో కలిసి సినిమాలు చేసి ప్రేమ బంధం ద్వారా ఒక్కటైన మరో జంట ‘శ్రీకాంత్ – ఊహ’. వీరిద్దరూ కలిసి నటించిన ‘ఆమె’, ‘కూతురు’ బాగా పాపులర్ అయ్యాయి. శ్రీకాంత్ తో వివాహానంతరం చిత్రాలకు దూరంగా ఉన్నారు ఊహ. వీళ్ళ కుమారుడు రోషన్ కూడా నటుడే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళిసందడి’ సినిమా సీక్వెల్ లో రోషన్ నటించాడు. రోషన్ మొదటి సినిమా ‘నిర్మల కాన్వెంట్’ కాగా సీక్వెల్ గా వచ్చిన ఆ సినిమా పేరు కూడా ‘పెళ్లి సందడి’ అన్న విషయం తెలిసిందే.
4. నందు, గీతామాధురి:
తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన గాయని గీతామాధురి. ‘100% లవ్’ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించి ప్రేక్షకులకు చేరువయిన నటుడు నందు. వీరిద్దరి వివాహం 2014లో జరిగింది. వీరిద్దరూ ‘అథితి’ అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించారు. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీ కపుల్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు వీరిద్దరూ.
5. మహేష్ బాబు, నమ్రత:
మహేష్ బాబు, నమ్రత… టాలీవుడ్ ప్రేక్షకులకు అతి ప్రియమైన జంటలలో ఒక జంట. ఈ ఇద్దరూ వారివారి కెరీర్లలో సక్సెస్ ఫుల్ గా ఉన్నారు. ఆ సమయంలో ‘వంశీ’ సినిమాతో వీరిద్దరూ మొదటిసారి కలిశారు. 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా తరువాత ఐదేళ్లకు వీరు వివాహం చేసుకున్నారు. ‘అతడు’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ముంబైలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పిల్లలు గౌతమ్, సితార కూడా మినీ సెలెబ్రిటీలే.
6. కృష్ణవంశీ, రమ్యకృష్ణ:
తెలుగు ప్రేక్షకులకు ఎన్నో హిట్ సినిమాలను అందించిన దర్శకుడు కృష్ణవంశీ. తెరపై తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్న నటి రమ్యకృష్ణ. వీరిద్దరూ కలిసి ‘చంద్రలేఖ’, ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలకు వర్క్ చేశారు. వీరిద్దరు 2003లో పెళ్లి పీటలెక్కి ఒక్కసారి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం కృష్ణవంశీ, రమ్యకృష్ణ వారివారి సినిమాలతో ఫుల్ గా బిజీగా ఉన్నారు.
7. నాగచైతన్య, సమంత:
టీ టౌన్ కు చెందిన మరో బ్యూటిఫుల్ పెయిర్ నాగచైతన్య, సమంత. తెలుగు సినిమా ప్రేక్షకులను మాయ చేసి పడేసారు సామ్, చైతన్య. ఈ క్యూట్ కపుల్ కలిసి తెరపై కనిపించినా… తెరవెనుక ఈవెంట్స్ లలో కనిపించినా ఫ్యాన్స్ కి పండగే పండుగ. ‘ఏ మాయ చేసావే’ సినిమా దగ్గర నుంచి ఈ మధ్య వచ్చిన ‘మజిలీ’ సినిమా వరకూ వీరి పెయిర్ కి ప్రేక్షకులలో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.