Most Popular Television Shows In Telugu

Most Popular Television Shows In Telugu

బుల్లితెరపై బాగా విజయం సాధించిన షోస్

Most Popular Television Shows In Telugu

ఎంటర్టైన్మెంట్ తో రోజు వారి గందరగోళాలు, పని ఒత్తిడిలు నుంచి తప్పించుకోవాలని భావిస్తారు ప్రేక్షకులు. అటువంటి వారే ప్రధాన లక్ష్యంగా అద్భుతమైన కాన్సెప్ట్స్ తో ఎన్నో షోస్ బుల్లితెరపై ప్రసారమయ్యాయి. అనుకున్నట్టుగానే ఆ షోస్ ప్రేక్షకులకు చేరువై బ్రహ్మాండమైన విజయం సాధించాయి. ప్రస్తుత కాలంలో ఒక ఛానల్ విజయంలో షోస్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకొని వారికి ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ను ఇస్తున్నాయి టెలివిజన్ షోస్. మొత్తానికి ఒకపక్క ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ వస్తుంటే… మరోపక్క షోస్ కి రేటింగ్స్ బాగా వస్తున్నాయి. 

1. వావ్:
ఈటీవిలో బాగా హిట్ అయిన షో… వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో కూడా ఉంది. ‘వావ్ 1’, ‘వావ్ 2’ తరహాలోనే ‘వావ్ 3’ కూడా ప్రేక్షకుల ఆదరణ బాగా పొందుతోంది. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ ఈ షోకి హోస్ట్ చేస్తున్నాడు. టీవీ ప్రపంచంలో బాగా విజయం సాధించిన గేమ్ షోస్ లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ షోలో పాల్గొనే పార్టిసిపంట్స్ కు వారు రావడంతోటే పది లక్షలు ఇస్తారు. ఆటలో భాగంగా అడిగే ప్రశ్నలకి వారు సరైన సమాధానం చెప్పవలసి ఉంటుంది. చెప్పిన ప్రతీ తప్పు సమాధానానికీ వారి డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. అలా ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బు ఉంటుందో వారు గేమ్ లో గెలుస్తారు.

Most Popular Television Shows In Telugu2. ఆలీతో సరదాగా:
ఈటీవిలో ఈ చాట్ షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ టాక్ షోకి టాలీవుడ్ పాపులర్ కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తున్నాడు. బుల్లితెరకు చెందినవారూ, వెండితెరకు చెందినవారూ ఈ షోలో పాల్గొంటారు. టెలివిజన్ చరిత్రలో రన్ అవుతోన్న పాపులర్, లాంగెస్ట్ టాక్ షోలలో ఇది ఒకటి అంటే ఈ షో ఎంత పెద్ద హిట్టో అర్ధం చేసుకోవచ్చు. ప్రతీ సోమవారం ఈ షో ప్రసారమవుతోంది.

Most Popular Television Shows In Telugu3. జబర్దస్త్:
ఈ షో చూస్తున్నప్పుడు ఎవరైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఈటీవీలోనే ప్రసారమవుతోన్న ఈ షో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాపులర్ కామెడీ షో ప్రసారమై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ షో ఇంకా రన్ అవుతోందంటే ఈ షో ఎంత పెద్దగా విజయం సాధించిందో ఇట్టే అర్థమయిపోతుంది. తెలుగులో ప్రసారమయిన కామెడీ షోలలో బాగా పాపులర్ అయిన షోలలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ షోలో పాల్గొన్న టాలెంటెడ్ కమెడియన్స్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు.

Most Popular Television Shows In Telugu4. బిగ్ బాస్:
బిగ్ బాస్… అల్టిమేట్ రియాలిటీ షో. ఇప్పటివరకు ఈ షో నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. ఐదవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ రియాలిటీ షోలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి కంటెస్టెంట్లు టాస్కులతో కుస్తీ పడడం ప్రేక్షకులకు తెలిసిన విషయమే. బిగ్ బాస్ సీజన్ 5 ఆగష్టు, లేదా సెప్టెంబర్ లలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ సీజన్ 5లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Most Popular Television Shows In Telugu5. క్యాష్:
ఈటీవీలో ప్రసారమవుతోన్న మరొక గేమ్ షో… క్యాష్, 2.0. సుమా కనకాల హోస్ట్ చేస్తోన్న ఈ షోకి అభిమానులు బాగానే ఉన్నారు. సరదాగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఓ ఫామిలీ షో ఇది. ఈ షోలో ఎస్టాబ్లిష్డ్ సెలెబ్రిటీస్ ఎందరో పాల్గొన్నారు. ఉత్కంఠ కలిగించే రౌండ్లు, సుమ సరదా జోకులు ఈ షోని బాగా హిట్ చేశాయి.

Most Popular Television Shows In Telugu6. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్:
జీ తెలుగు వారి గేమ్ ‘షో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్’ కూడా చాలా పెద్ద హిట్టయింది. ఈ షో రెండవ సీజన్ కి సుమ, రవి వ్యాఖ్యాతలు. సుమ, రవి కలిసి హోస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ షో ముందు సీజన్ ని ప్రదీప్ హోస్ట్ చేశాడు. ఆ తరువాత ప్రదీప్ స్థానంలో సుమ, రవి వచ్చారు. పేరున్న సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొండడంతో ఈ షో ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది.

Most Popular Television Shows In Telugu
Also Read Co-Stars In Tollywood Become Couples

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here