National Awards Received By South Celebrities Several Times

National Awards Received By South Celebrities Several Times

జాతీయ పురస్కారాలు అనేకసార్లు పొందిన 5 సౌత్ ప్రముఖులు

National Awards Received By South Celebrities Several Times

సౌత్ ఫిలిం ఇండస్ట్రీ…. బాలీవుడ్ కి ధీటుగా పోటీ ఇచ్చిన చిత్ర పరిశ్రమ. కథ, స్క్రీన్ ప్లే, నటన, సంగీతం, దర్శకత్వం… ఇలా ఏ విషయంలోనైనా బాలీవుడ్ కి చాలా గట్టిగా పోటీ ఇచ్చి మరీ తన సత్తా చాటుకొంది మన దక్షిణ భారత సినిమా పరిశ్రమ. భారత దేశమే గర్వించదగ్గ ఎన్నో సినిమాలు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. దక్షిణ సినిమా పరిశ్రమ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. స్టార్ట్ అయినదగ్గర నుంచి సినిమా ఎండ్ అయ్యేంతవరకూ సినిమాకి సంబంధించిన ప్రతీ విషయంలో పర్ఫెక్షన్ ఉండేలా జాగ్రత్తపడుతూ ఉంటారు మన దక్షిణ సినిమా పరిశ్రమ పెద్దలు. దాంతో, మన దక్షిణ సినిమా పరిశ్రమకు చెందిన ప్రతిభ గల అనేక మందికి ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. 

1. కే. జే. ఏసుదాస్:
ప్రఖ్యాత ప్లే బ్యాక్ సింగర్, కర్నాటిక్ సింగర్ అయిన ఏసుదాస్ జనవరి 10, 1940వ సంవత్సరంలో జన్మించారు. ఏసుదాస్ పూర్తి పేరు కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్. హిందీ, మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఒడియా, మరాఠీ, ఇంకా ఇంగ్లీష్, అరబిక్, లాటిన్, రష్యా భాషలలో ఏభై వేలకు పైగా ఏసుదాస్ పాటలు పాడాడు. 1975లో పద్మ శ్రీ, 2002లో పద్మ భూషణ్, 2017లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఏసుదాస్ ని వరించాయి. ఒకేరోజు నాలుగు దక్షిణ భారత సినిమాలకు 16 పాటలను పాడిన ఘనత ఏసుదాస్ కి ఉంది. 2011లో యేసుదాస్ సంగీత రంగంలో చేసిన కృషికి సిఎన్ఎన్-ఐబిఎన్ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. అతను తన ప్లేబ్యాక్ సింగింగ్ కి 7 జాతీయ అవార్డులను పొందాడు.National Awards Received By South Celebrities Several Times2. ఎస్.పి. బాలసుబ్రమణ్యం
దివంగత బాలసుబ్రమణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. మన తెలుగువారందరూ గర్వపడే బాలసుబ్రమణ్యం కేవలం గాయకుడు మాత్రమే కాదు సినిమా నిర్మాత, నటుడు, సంగీత దర్శకుడు కూడా. నలభై వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఎస్.పి.బీ ది. 1980వ నాటి ‘శంకరాభరణం’ సినిమాతో బాలసుబ్రమణ్యానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2001లో ‘పద్మ శ్రీ’, 2011లో ‘పద్మ భూషణ్’ పురస్కారాలు బాలూకు వచ్చాయి. మొత్తం మీద ఎస్పిబీకి ఆరు జాతీయ సినిమా పురస్కారాలు వచ్చాయి. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కు ప్లే బ్యాక్ సింగర్ అలాగే సినిమా నిర్మాత కూడా.National Awards Received By South Celebrities Several Times3. చిత్ర:
నేపథ్య గాయని చిత్ర అనేక భారతీయ భాషలలో ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడింది. తన కెరీర్ లో చిత్ర ఆరు జాతీయ పురస్కారాలను అందుకొంది. ఎనిమిది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా సంపాదించుకోగలిగింది చిత్ర. 2005లో ‘పద్మ శ్రీ’, 2021లో ‘పద్మ భూషణ్’ పురస్కారాలు చిత్రని వరించాయి. మలయాళ సినిమాతో సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది చిత్ర. చిత్ర తండ్రి కృష్ణన్ నాయర్ ఓ ప్రముఖ సింగర్ అలాగే మ్యూజిషన్ కూడా. మ్యూజిక్ కంపోజర్లు రెహమాన్, హంసలేఖ, ఇళయరాజా, కీరవాణిలతో ఎక్కువగా చిత్ర పనిచేసింది.

National Awards Taken By Our South Celebrities Multiple Times4. సుశీల:
పి సుశీలగా ప్రేక్షకులకు దగ్గరైన పులపాక సుశీల నవంబర్ లో 1935లో విజయనగరంలో జన్మించారు. ఆరు దశాబ్దాలుగా తన గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సుశీలను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల వారు అలాగే ఆసియ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించారు. తన కెరీర్ లో సుశీల సుమారు ఏభై వేల పాటలు పాడారు. సుశీల బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ఐదు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ‘గాన కోకిల’, ‘గాన సరస్వతి’గా గుర్తింపు పొందిన సుశీల… సౌత్ నుంచి జాతీయ అవార్డును గెలుచుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు.National Awards Received By South Celebrities Several Times5. జానకి:
ఎస్ జానకి పూర్తి పేరు శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి. జానకి కేవలం నేపథ్య గాయనీగానే కాదు కొన్నిసార్లు సంగీతం-స్వరకర్తగా కూడా పనిచేశారు. అనేక భాషలలో జానకి సుమారు 48 వేల పాటలు పాడారు. జాతీయ, అంతర్జాతీయ భాషలన్నిటిలో కలిపి జానకి మొత్తం మీద ఇరవై భాషలలో పాటలు పాడారు. తమిళ సినిమాతో సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన జానకి ఆరు దశాబ్దాల పైగానే శ్రోతలను తన గాత్రంతో అలరించారు. ప్లే బ్యాక్ సింగర్ గా నాలుగు జాతీయ పురస్కారాలను అందుకొన్నారు జానకి. 2013లో ‘పద్మ శ్రీ’ పురస్కారంతో జానకిని సత్కరించాలని భారతదేశ ప్రభుత్వం భావించింది. అయితే, ఆ పురస్కారం తన కెరీర్ కు ఎంతో ఆలస్యంగా వచ్చిందని చెబుతూ ఆ పురస్కారాన్ని తిరస్కరించారు జానకి.
National Awards Received By South Celebrities Several TimesAlso Read: Tollywood Celebrities Who Entered Into Politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here