Prestigious Awards Received By Our 7 Tollywood Stars

Prestigious Awards Received By Our Seven Tollywood Stars

పౌర పురస్కారాలు అందుకున్న 7 టాలీవుడ్ స్టార్స్

Prestigious Awards Received By 7 Tollywood Stars

ఆర్ట్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, మెడిసిన్, సోషల్ వర్క్, స్పోర్ట్స్ తదితర రంగాల్లో అసాధారణమైన సేవ లేదా పనితీరును ప్రదర్శించిన వారికి భారతదేశం పౌర పురస్కారాలను అందిస్తుంది. పౌర పురస్కారాలలో నాలుగు రకాల పురస్కారాలు ఉన్నాయి. వాటిని ర్యాంక్ ప్రకారం చూస్తే… భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లు ఉంటాయి. మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన తారల్లో కొంతమందికి పౌర పురస్కారాలు వరించాయి. 

1. ఏఎన్నార్:
ఏఎన్నార్ గా బాగా సుపరిచితమైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ లో ఓ ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలో ఆయన 70ఏళ్లకు పైగా నటనా కెరీర్ ని కొనసాగించారు. అభిమాన హృదయాలలో ఏఎన్నార్ ఓ విభిన్న నటుడిగా నిలిచారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన అద్భుతమైన కృషికిగానూ ఏఎన్నార్ ను పౌర పురస్కారాలు వరించాయి. 1968లో పద్మశ్రీ పురస్కారం, 1988లో పద్మభూషణ్ పురస్కారం, 2011లో పద్మవిభూషణ్ పురస్కారం ఆయన్ను వరించాయి.Prestigious Awards Received By 7 Tollywood Stars2. చిరంజీవి:
మెగాస్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని కలిగించుకున్నారు చిరంజీవి. భారత సినిమా పరిశ్రమలో గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన 1979 నాటి సినిమా ‘పునాదిరాళ్లు’తో చిరు తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించారు. తన డాన్స్, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు మెగాస్టార్. చిరంజీవి సినిమా కెరీర్ లో ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. 2006లో భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

Prestigious Awards Received By 7 Tollywood Stars3. కృష్ణ:
తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటుడు కృష్ణ. 1965లో ‘తేనె మనసులు’ సినిమాతో తెరంగేట్రం చేశారు కృష్ణ. ఆ తరువాత ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సూపర్ స్టార్ కి. సుమారు ఐదు దశాబ్దాల పాటు తన అభిమానుల్ని తన నటనతో అలరించారు. 2009లో పద్మభూషణ్ పురస్కారం కృష్ణను వరించింది.

Prestigious Awards Received By 7 Tollywood Stars4. మోహన్ బాబు:
టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ ఎవరంటే ఎవరైనా ఖచ్చితంగా చెప్పే పేరు ‘మోహన్ బాబు’ అని. మోహన్ బాబు తన డైలాగ్స్ తో అంతలాగా ఫేమస్ అయ్యారు. మోహన్ బాబు డైలాగ్ చెప్పే విధానం నిజంగా మెస్మరైజింగ్ గా ఉంటుంది. మోహన్ బాబుకు విద్యా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్ లో అత్యుత్తమ కృషి చేసినందుకుగానూ పద్మశ్రీ పురస్కారం ఆయన్ని 2007లో వరించింది.

Prestigious Awards Received By 7 Tollywood Stars5. శ్రీదేవి:
అతిలోక సుందరులు ఎలా ఉంటారో తెలియదు కానీ మన తెలుగు వాళ్లకు మాత్రం శ్రీదేవే అతిలోక సుందరి. టాలీవుడ్ లో గోర్జియస్ నటీమణుల్లో దివంగత శ్రీదేవి కూడా ఒకరు. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక భాషలలో అనేక సినిమాల్లో నటించారు శ్రీదేవి. ఆ తరువాత హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. దక్షిణ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా తన టాలెంట్, బ్యూటీతో ప్రేక్షకులను ఫిదా చేశారు. కొంతకాలం బ్రేక్ తరువాత 2012లో ‘ఇంగ్లీష్ వింగ్లిష్’తో తిరిగి వెండితెర మీద తళుక్కుమన్న శ్రీదేవి ఆ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. 2013లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు శ్రీదేవి.

Prestigious Awards Received By 7 Tollywood Stars6. బాలసుబ్రమణ్యం:
దివంగత బాలసుబ్రమణ్యం కేవలం మంచి గాయకుడే కాదు, మంచి కంపోజర్, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. బాలు తన అమోఘమైన గాత్రంతో ప్రేక్షకులను ఎంతగానో మైమరిపించేవారు. 40 వేలకు పైగా పాటలు పాడిన బాలును భారత ప్రభుత్వం సత్కరించకుండా ఉంటుందా? 2001లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చిన భారత ప్రభుత్వం, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. 2020 సెప్టెంబర్ 25న బాలు చనిపోయిన సంగతి తెలిసిందే. 2021లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారాంతో గౌరవించింది.

Prestigious Awards Received By 7 Tollywood Stars7. బ్రహ్మానందం:
తెలుగు ప్రేక్షకులకు ఎవరి పేరు చెబితే నవ్వు వచ్చేస్తుందో, ఎవరి పేరు చెబితే పొట్ట చెక్కలయ్యేలా అభిమానులు నవ్వుతారో… ఆయనే బ్రహ్మానందం. టాలీవుడ్ లో ఓ పాపులర్ కమెడియన్ గా గుర్తింపు పొందారు బ్రహ్మానందం. చలన చిత్ర రంగానికి కృషి చేసిన బ్రహ్మానందాన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ సత్కరించింది. 2009లో ఈ స్టార్ కమెడియన్ ని పద్మశ్రీ పురస్కారం వరించింది.

Prestigious Awards Received By 7 Tollywood Stars

Also Read Super Hit Movies Produced By Suresh Productions

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here