Real Life Sisters Photos In Tollywood

Real Life Sisters Photos In Tollywood

టాలీవుడ్ లో అక్కాచెల్లెల్లు

Real Life Sisters in Tollywood

సినిమావాళ్ళ కుటుంబసభ్యులు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోని వివిధ రంగానికి చెందిన వాళ్ళ కుటుంబీకులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ రంగంలో వారూ విజయాపతాకం ఎగరవేశారు. కొంతమంది తెలుగు హీరోయిన్స్ కూడా వారి చెల్లిళ్లనూ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమ అక్కల జాడలోనే తామూ విజయం పొందాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వారీ సిస్టర్స్. 

1. కాజల్ అగర్వాల్ – నిషా అగర్వాల్:
టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ఒక బిజీ హీరోయిన్ గా, అగ్ర కథానాయికగా వెలుగొందిన విషయం తెలిసిందే. ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా వెండితెరకు పరిచయమయింది. అయితే, కాజల్ అగర్వాల్ పరిశ్రమలో విజయవంతమయినంతగా… నిషా అగర్వాల్ విజయం కాలేదు. తెలుగులో నిషా చేసిన సినిమాలు కూడా తక్కువే. ‘ఏమైంది ఈ వేళ’, ‘సోలో’, ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ అనే తెలుగు చిత్రాల్లో నిషా నటించింది. అయితే, ‘సోలో’, ‘సుకుమారుడు’ సినిమాలు మాత్రమే పెద్దగా పాపులర్ అయ్యాయి. దాంతో, నిషా అగర్వాల్ సినిమాలకు బాయ్ చెప్పేసి ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహమాడింది. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు.

Real Life Sisters in Tollywood2. నగ్మా – జ్యోతిక:
నగ్మా… 90లలో ఓ పెద్ద కథానాయిక. అప్పటి అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించింది నగ్మా. నగ్మా సోదరి జ్యోతిక కూడా పరిశ్రమకు పరిచయమయ్యి ఓ టాప్ హీరోయిన్ అయింది. తమిళ, తెలుగు భాషలలో సినిమాలు చేసింది జ్యోతిక. జ్యోతిక మొదటి తెలుగు సినిమా ‘ఠాగూర్’. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో జ్యోతిక ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అతి చిన్న పాత్ర అయినా… జ్యోతిక ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చింది. 2006 సెప్టెంబర్ 11న తమిళ అగ్ర హీరో అయిన సూర్యను వివాహమాడింది జ్యోతిక. ఆ తరువాత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది జ్యోతిక.

Real Life Sisters in Tollywood3. ఆర్తీ అగర్వాల్ – అథితి అగర్వాల్:
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోయిన నటి ఆర్తి అగర్వాల్. అగ్ర కథానాయికగా ఉన్నప్పుడు యువహీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా జత కట్టింది ఆర్తీ. ఒకపక్క తరుణ్, ఉదయ్ కిరణ్, జూనియర్ ఎన్టీఆర్, వంటి యువహీరోలతో ఆడిపాడుతూనే మరోపక్క చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్స్ మూవీస్ లో కూడా నటించింది. సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో అన్నిటినీ ఒప్పుకోలేక ఇక తన సోదరి అథితి అగర్వాల్ ను రంగంలోకి దింపింది ఆర్తి. రాఘవేంద్రరావు వందవ సినిమా ‘గంగోత్రి’ సినిమాతో అథితి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమయింది. అయితే, తన సోదరి ఆర్తి అగర్వాల్ లాగా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయింది అథితి. దాంతో అతిథి సినిమా పరిశ్రమకు దూరమయింది. 2015లో ఆర్తి అగర్వాల్ మరణించిన విషయం తెలిసిందే.

Real Life Sisters in Tollywood4. కార్తీక – తులసి:
ఒకప్పుడు నటిగా తెలుగు ప్రేక్షాదరణ బాగా పొందిన నటి రాధ. ఈమె కూతుళ్లే కార్తీక – తులసి. కార్తీక మొదటి తెలుగు సినిమా ‘జోష్’. నాగచైతన్య కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాదల్’ మూవీ రాధా రెండవ కుమార్తె తులసి మొదటిసినిమా. ఈ సినిమా తెలుగులో ‘కడలి’గా రిలీజ్ అయింది. ‘జోష్’ తరువాత తెలుగులో కార్తీక ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ సినిమాల్లో నటించింది. తమిళ డబ్బింగ్ సినిమా ‘రంగం’ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అయితే, కార్తీకకు తెలుగులో అవకాశాలు రావడానికి ఈ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. 2017లో ‘ఆరంభ్’ అనే టెలివిజన్ సిరీస్ తో బుల్లితెరకు పరిచయమయింది కార్తీక. స్టార్ ప్లస్ లో ఈ ఇది ప్రసారమైంది. ఈ సిరీస్ మంచి ఆదరణ పొందింది. ఇక తులసి కూడా తమిళంలో ‘కాదల్’ తరువాత మరొక తమిళ సినిమా మాత్రమే చేసింది.

Real Life Sisters in Tollywood5. షాలిని – షామిలి:
షాలిని, షామిలీ ఇద్దరూ వెండితెరకు చైల్డ్ యాక్టర్స్ గానే పరిచయమయ్యారు. మాధవన్ తో షాలిని చేసిన ‘సఖి’ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా తెలుగు ప్రేక్షాదరణ కూడా బాగానే పొందింది. నటిగా మలయాళం, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసిన షాలిని 2000వ సంవత్సరంలో హీరో అజిత్ ను వివాహమాడింది. ఇక షామిలి విషయానికొస్తే… బేబీ షామిలిగా ప్రేక్షకులకు షామిలి బాగా పరిచయమే. హీరోయిన్ గా తెలుగులో ‘ఓయ్’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది షామిలి. 2018లో ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలరించింది ఈ బ్యూటీ.

Real Life Sisters in Tollywood

Also Read: 8 Popular Tollywood Couples

Related post

Leave a Reply

Your email address will not be published.