
Remuneration Of Tollywood Actress
టాలీవుడ్ హీరోయిన్లలో లో టాప్ పేమెంట్ ఎవరికి?
Telugu Actress Remuneration
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది అందమైన, ప్రతిభావంతమైన హీరోయిన్లు ఉన్నారు. వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండడం విశేషం. వాస్తవానికి, కొంతమంది టాలీవుడ్ హీరోయిన్లు పాన్ ఇండియా ఫాలోయింగ్ ని కూడా కలిగి ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన పోస్ట్లు చేస్తూ సోషల్ మీడియా ద్వారా కూడా టాలీవుడ్ హీరోయిన్స్ ఇంకా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. మరి టాలీవుడ్ హీరోయిన్స్ పారితోషకం ఎంత ఉంటుంది?
1. నయనతార:
లేడీ సూపర్ స్టార్ గా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నయనతార ఒక సినిమాకి దాదాపు నాలుగు కోట్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో మూడు తమిళ సినిమాలు కాగా ఒకటి తెలుగు చిత్రం. తెలుగులో నయనతార, గోపీచంద్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.
2. అనుష్క శెట్టి:
‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి చిత్రాల్లో తన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అనుష్క శెట్టి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క రీసెంట్ మూవీ ‘నిశబ్దం’. 2020లో ఈ సినిమా వచ్చింది. అన్నట్టు స్వీటీ ఒక ప్రాజెక్టుకు 3.5 కోట్లు పుచ్చుకుంటున్నారు.
3. సమంతా అక్కినేని:
సమంతా అక్కినేని… టాలీవుడ్ గోర్జియస్ హీరోయిన్. వివాహానంతరం ప్రాముఖ్యత ఉన్న పాత్రలకే సమంతా ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’, ‘జాను’ చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించిన సమంతా ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రత్యుషా సపోర్ట్ అనే ఎన్జీఓకు సమంత ఓనర్ గా ఉన్నారు. ఒక సినిమాకు సమంతా తీసుకునే పారితోషకం దాదాపుగా మూడు కోట్లు ఉంటుందని అంచనా.
4. కాజల్ అగర్వాల్:
కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ భారీగానే ఉందని తెలుస్తోంది. ఈ టాలీవుడ్ చందమామ ఓ ప్రాజెక్టుకి దాదాపుగా మూడు కోట్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో చిరంజీవితో అమ్మడు నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
5. కీర్తి సురేష్:
‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా తనవైపుకు అందరి దృష్టినీ తిప్పుకున్నారు కీర్తీ సురేష్. ఆ సినిమాలో నిన్నటితరం కథానాయిక ‘సావిత్రి’ పాత్రలో కీర్తీ సురేష్ జీవించారని చెప్పాలి. ఈ సినిమాతో జాతీయ పురస్కారం కూడా అందుకున్న కీర్తిసురేష్ పారితోషకం మూడు కోట్లు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ‘గుడ్ లక్ సఖి’, ‘సర్కారు వారి పాట’ అనే రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.
6. పూజా హెగ్డే:స్క్రీన్ పై తన గోర్జియస్ లుక్స్ తో, ఛార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమా పరిశ్రమలో ఓ బిగ్ స్టార్ గా ఎదిగారు పూజా హెగ్డే. తన తోటి సినిమా హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చారు పూజా. ఈ అమ్మడి పారితోషకం కూడా ఆకాశాన్ని అంటుతోందని తెలుస్తోంది. పూజా ఓ ప్రాజెక్టుకు రెండు కోట్లు పుచ్చుకుంటున్నారు. ‘ఆచార్య’లో రాంచరణ్ కు జోడీగా, ‘రాధే శ్యామ్’లో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు.
7. రకుల్ ప్రీత్ సింగ్:
పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఆల్మోస్ట్ టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితోనూ నటించారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ ఒక ప్రాజెక్టుకి రెండు కోట్లు పుచ్చుకుంటున్నారట. క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ ఓ సినిమాలో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో రకుల్ కథానాయికగా ‘అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్’ అనే సినిమా రూపొందుకుంటోంది. ఇక రకుల్ చేతిలో కొన్ని హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.
8. తమన్నా:
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఈ స్టార్ హీరోయిన్ కూడా ఓ ప్రాజెక్ట్ కి 1.50 కోట్లు పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది సినిమాల్లోనూ నటించిన తమన్నా బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. ‘మాస్ట్రో’, ‘సీటిమార్’లలో తమన్నా నటించగా ఆ సినిమాల షూటింగ్ పూర్తయింది. ‘ఎఫ్ 3’తో ప్రస్తుతం మిల్కీబ్యూటీ బిజీగా ఉన్నారు.
Also Read : Top Telugu Serials Which Continued For Many Years