Tollywood Celebrities Who Entered Into Politics

Tollywood Celebrities Who Entered Into Politics

పాలిటిక్స్ లోకి ఎంటరైన టాలీవుడ్ యాక్టర్స్

Telugu Celebrities In Politics

సినిమా ద్వారా కొన్ని లక్షల మందికి చేరువవుతారు సినిమా పరిశ్రమకు చెందినవాళ్లు. అందులోనూ సినిమా నటీనటులైతే ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినిమాలో వారు పోషించే పాత్రల ద్వారా, ఆ పాత్రలతో తాము ఇచ్చే సందేశాల ద్వారా ఎంతో మంది దృష్టిని తమ వైపుకు ఆకర్షించే నటీనటులు ఎందరో. ఈ విధంగా ప్రేక్షకదారణ పొందిన కొంతమంది నటీనటులు వారి నిజజీవితంలో కూడా ప్రజల కష్టాలను తొలగించాలని తహతహలాడారు. దాంతో రాజకీయాలవైపు అడుగులు వేశారు. 

1. ఎన్టీఆర్:
రాజకీయాల్లోకి ఎంటరైన సినిమా స్టార్స్ అనగానే తెలుగు ప్రేక్షకుడికి తప్పకుండా గుర్తుకువచ్చే పేరు నందమూరి తారక రామారావు. దాదాపు మూడు వందల తెలుగు సినిమాల్లో నటించిన ఎన్టీఆర్… రాజకీయాల్లోకి ఎంటరయ్యి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. అప్పటివరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యేవారు. సీనియర్ ఎన్టీఆర్ ఆ చరిత్రను కూడా మార్చారు. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయింది ఎన్టీఆరే.

Telugu Celebrities In Politics2. చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో తెలిసిందే. సినిమా పరిశ్రమలో కష్టపడి మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు చిరు. సినిమా రంగంలోకి నటుడిగా స్థిరపడాలనుకునేవారికి చిరంజీవే ఓ ఇన్స్పిరేషన్. చిరంజీవి కూడా రాజకీయాల్లోకి ఎంటరయ్యి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. కాని కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని కలిపేశారు చిరు. అప్పటికి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ముప్పై నెలలు అయింది. చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లోకి తన పార్టీని చేర్చిన కొంతకాలానికి అంటే 2012 మార్చి 29న రాజ్యసభకు చిరంజీవి నామినేట్ అయ్యారు. టూరిజంకి మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎలక్షన్స్ నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు చిరంజీవి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ చేప్పట్టిన ఏ మీటింగ్ కీ కూడా చిరు అటెండ్ కాలేదు. 2018 ఏప్రిల్ లో రాజ్యసభ మెంబెర్ గా చిరు టెన్యూర్ అయిపొయింది.

Telugu Celebrities In Politics3. పవన్ కళ్యాణ్:
చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ విభాగమైన ‘యువరాజ్యం’ ప్రెసిడెంట్ గా ఉన్నారు పవన్. కాంగ్రెస్ లోకి చిరంజీవి తన పార్టీని చేర్చినప్పుడు, పొలిటికల్ లైఫ్ కి దూరంగా ఉంటూనే తమ సొంత పార్టీని మరోపార్టీలోకి చేర్చే విషయంపై తన అయిష్టాన్ని చూపించారు. 2014లో ‘జనసేన పార్టీ’ని స్థాపించారు పవర్ స్టార్. ఇక అప్పటినుంచి తన రాజకీయ పార్టీతో ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నారు పవన్.

Telugu Celebrities In Politics4. మోహన్ బాబు:
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్ మోహన్ బాబు కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ తో మోహన్ బాబుకు ఎంతో అనుబంధం ఉంది. దాంతో సీనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో ఉన్న ‘తెలుగు దేశం పార్టీ’కి విస్తృతంగా ప్రచారం చేశారు మోహన్ బాబు. ఆ పార్టీలోకి 1982లో జాయిన్ అయ్యారు కూడా. ఆ తరువాత కొంతకాలానికి టీడీపీని విడిచిపెట్టి సినిమా పరిశ్రమలోకి తిరిగి అడుగుపెట్టారు ఈ డైలాగ్ కింగ్. మోహన్ బాబు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారేమో అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Celebrities In Politics5. రోజా:
తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించారు రోజా. 1999లో తెలుగు దేశం పార్టీలో చేరారు రోజా. ఆ పార్టీకి చెందిన ‘తెలుగు మహిళా’ విభాగానికి ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. 2009లో టీడీపీని విడిచిపెట్టి ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’లోకి జాయిన్ అయ్యారు. 2014 జనరల్ ఎలక్షన్స్ లో నగరి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ నుంచి ఎంఎల్ఏగా గెలిచారు. మళ్ళీ నగరి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ నుంచే 2019లో కాంటెస్ట్ చేసిన రోజా మళ్ళీ గెలిచారు. 2020లో ఏపీఐఐసి చైర్ పర్సన్ గా అపాయింట్ అయ్యారు.
Telugu Celebrities In PoliticsAlso Read: 5 Comedians Who Will Be Remembered Forever By Telugu Audience

Related post

Leave a Reply

Your email address will not be published.