
Tollywood Celebrities Who Faded Away After A Few Films
టీ టౌన్ లో కనుమరుగైన నటీనటులు
Top Celebrities Who Got Disappeared From Tollywood
చిత్ర పరిశ్రమకు రోజురోజుకూ ఎంతో మంది నటీనటులు పరిచయమవుతూ ఉంటారు. కొంతమంది వరుస హిట్లు ఇచ్చి ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం ఎన్ని హిట్లు ఉన్నా కొన్ని సినిమాల తరువాత పరిశ్రమకు దూరమవుతూ ఉంటారు.
1. వేణు తొట్టెంపూడి:
టాలీవుడ్ లో ప్రతిభావంతమైన నటుల్లో వేణు తొట్టెంపూడి ఒకరు. వేణు ప్రధానంగా కామెడీ సినిమాలలో లీడ్ యాక్టర్ గా నటించాడు. వేణు కామెడీ యాక్షన్, ఎక్సప్రెషన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు వేణు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత కూడా వేణు… ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘గోపి గోపికా గోదావరి’, వంటి మరెన్నో హిట్ సినిమాలలో నటించాడు. 2013లో ‘రామాచారి’ సినిమాలో నటించిన వేణు ఆ తరువాత సినిమాలకు దూరమయ్యాడు.
2. వడ్డే నవీన్:
సినిమా నిర్మాత వడ్డే రమేష్ కుమారుడు వడ్డే నవీన్. టాలీవుడ్ లో మంచి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. వాస్తవానికి, వడ్డే నవీన్ ఎక్కువగా ఎమోషనల్ డ్రామా సినిమాల్లో నటించాడు. 1997లో ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో మూవీ కెరీర్ ని మొదలుపెట్టాడు ఈ హీరో. ఆ తరువాత ‘పెళ్లి’, ‘చెప్పాలని ఉంది’, ‘నా ఊపిరి’ వంటి అనేక చిత్రాలలో ప్రధాన పాత్రల్లో నటించాడు. ‘నా ఊపిరి’ సినిమాకు గాను వడ్డే నవీన్ కు నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా లభించింది. 2010లో ‘శ్రీమతి కళ్యాణం’ సినిమాతో వ్యూయర్స్ ముందుకు వచ్చిన నవీన్ ఆ తరువాత 2016లో ‘ఎటాక్’లో కనిపించాడు.
3. జై ఆకాష్:
ఆకాష్ అసలి పేరు సతీష్ నాగేశ్వరన్. ఈ హీరో తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగులో ఆకాష్ ఫస్ట్ మూవీ ‘రామా చిలకమ్మ’. ఆ మూవీ తరువాత ‘ఆనందం’, ‘వసంతం’, ‘అందాల రాముడు’ వంటి సినిమాలలో యాక్ట్ చేశాడు. 2019లో ‘దొంగ ప్రేమ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్ ఆ తరువాత టీ టౌన్ లో కనుమరుగయ్యాడు.
4. తారకరత్న:
టాలీవుడ్ లో తారకరత్న ఒక మోస్ట్ ఎనర్జిటిక్ నటుడిగా పేరు సంపాదించాడు. 2002లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో తెరకు ఎంట్రీ ఇచ్చాడు ఈ యాక్టర్. ‘భద్రాద్రి రాముడు’, ‘అమరావతి’, ‘నందీశ్వరుడు’ ఇలా అనేక సినిమాలలో తారకరత్న నటించాడు. 2009లో వచ్చిన ‘అమరావతి’ సినిమాలో బెస్ట్ విలన్ గా ఓ నంది పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు. 2017లో ‘ఖయ్యూం భాయ్’ సినిమా తరువాత టాలీవుడ్ లో తారకరత్న మరే సినిమా చేయలేదు.
5. రాజా:
టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సం హీరోలలో రాజా ఒకరు. తెలుగులో రాజా మొదటిసినిమా ‘ఓ చిన్నదానా’. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తో స్క్రీన్ ని షేర్ చేసుకున్నాడు రాజా. 2002లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత రాజా ‘ఆనంద్’, ‘స్టైల్’, ‘బంగారం’ వంటి ఎన్నో సినిమాలలో నటించాడు. 2013 తరువాత రాజా సినిమా పరిశ్రమకు దూరమయ్యాడు.
6. స్నేహా ఉల్లాల్:
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘సింహ’, ‘కరెంట్’ వంటి సినిమాలతో స్నేహా ఉల్లాల్ తెలుగులో మంచి పేరు సంపాదించుకొంది. ‘కింగ్’, ‘వరుడు’ సినిమాలలో స్నేహా ఉల్లాల్ గెస్ట్ రోల్స్ లో కనిపించింది. 2014వ నాటి ‘అంతా నీ మాయలోనే’ సినిమా తరువాత టాలీవుడ్ లో ఈ భామ మళ్ళీ కనిపించలేదు.
7. దీక్షా సేథ్:
అందాల నటి దీక్షా సేథ్ కూడా టాలీవుడ్ లో బాగానే సినిమాలు చేసింది. 2009 ‘ఫెమినా మిస్ ఇండియా’లో దీక్షా సేథ్ ఫైనలిస్ట్. 2010లో ‘వేదం’ సినిమాతో దీక్షా తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించింది. తెలుగులో దీక్ష… ‘మిరపకాయ్’, ‘వాంటెడ్’, ‘నిప్పు’, ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’, ‘రెబెల్’ వంటి సినిమాలలో నటించింది. 2012లో వచ్చిన ‘రెబెల్’ తరువాత దీక్షా టాలీవుడ్ లో మాయం అయింది.
8. భాను శ్రీ మెహ్రా:
నటి భాను శ్రీ మెహ్రా ‘వరుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీని గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు. ఇంకా తెలుగులో భాను ‘డింగ్ డాంగ్ బెల్’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’, ‘అలా ఎలా’ సినిమాలలో నటించింది. ‘అలా ఎలా’ సినిమా తరువాత భాను తెలుగులో నటించలేదు.