
Tollywood Celebrities Who Passed Away At A Young Age
యంగేజ్ లోనే మృతి చెందిన 6 టాలీవుడ్ సెలెబ్రిటీస్
South Indian Telugu Celebrities Who Left Early
వెండితెరపై ఆడి, పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే ముఖ్య లక్ష్యంగా… వారివారి పరిధుల్లో ఎంతవరకైనా వెళ్ళడానికి కూడా వెనుకాడరు యాక్టర్లు. అయితే, వారి ప్రతిభతో ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ గుర్తుండిపోగలిగే వారు మాత్రం కొంతమందే. టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిలో నిలిచిపోయినటువంటి కొంతమంది నటీనటులు నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం.
1. ఉదయ్ కిరణ్:
‘చిత్రం’ సినిమాతో పరిశ్రమకు అడుగుపెట్టిన హీరో ఉదయ్ కిరణ్. ఆ తరువాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు. ఉదయ్ కిరణ్ నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ‘నీ స్నేహం’, ‘శ్రీరామ్’, ‘కలుసుకోవాలని’ వంటి అనేక సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయిన ఉదయ్ కిరణ్ జనవరి 5, 2014న ఆత్మహత్య చేసుకొన్నాడు. ఉదయ్ కిరణ్ చనిపోవడంతో సినిమా పరిశ్రమ ఒక్కసారి షాక్ కి గురయింది.
2. సౌందర్య:
90లలో టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకొన్న నటి సౌందర్య. సుమారు 11 సంవత్సరాల పాటు టాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించింది సౌందర్య. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలు పొందింది సౌందర్య. ఏప్రిల్ 17, 2004లో ప్లేన్ క్రాష్ కారణంగా సౌందర్య మృతి చెందింది. సినిమా పరిశ్రమలో ఓ టాప్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సౌందర్య చనిపోవడంతో అభిమానులతో పాటు సినిమా పరిశ్రమ కూడా దిగ్బ్రాంతికి గురయింది. నిజంగా సినిమా పరిశ్రమ ఒక గొప్ప నటిని కోల్పోయింది.
3. దివ్యభారతి:
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఓ గుర్తింపు తెచ్చుకొన్న నటి దివ్యభారతి. అయితే, బీ టౌన్ లో గుర్తింపు తెచ్చుకునే ముందే టాలీవుడ్ లో దివ్యభారతికి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మొత్తానికి టీ టౌన్, బీ టౌన్, రెండిటిలో వర్క్ చేసిన దివ్యభారతి 1993, ఏప్రిల్ 5న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తన అపార్ట్మెంట్ లో ఐదవ ఫ్లోర్ నుంచి దివ్యభారతి కిందకు ప్రమాదవశాత్తు పడిపోయింది. దివ్యభారతి మృతి అప్పట్లో ఒక చర్చ అయింది. ఏది ఏమైనా దివ్యభారతి యొక్క అమాయకపు చూపులు, అద్భుతమైన నటనని సినిమా పరిశ్రమ కోల్పోయిందన్న మాట మాత్రం వాస్తవం.
4. యశో సాగర్:
2008నాటి ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో హీరోగా నటించాడు యశో సాగర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు హీరో యశో. అయితే, 2012 డిసెంబర్ 25న ఓ కార్ ఆక్సిడెంట్ లో యశో సాగర్ మృతి చెందాడు. కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత బి.పి.సోము కుమారుడు యశో సాగర్.
5. ఆర్తి అగర్వాల్:
2001నాటి ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు అగ్ర హీరోలందరితో నటించిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్. 2015 జూన్ 6న ఆర్తి అగర్వాల్ చనిపోయింది. మృతి చెందే ముందు ఆర్తి అగర్వాల్ బ్రీతింగ్ సమస్యలతో బాధపడింది. కార్డియాక్ అరెస్ట్ తో ఆమె మృతి చెందినట్లు ఆమె మేనేజర్ చెప్పాడు. చనిపోయేటప్పుడు ఆమె వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు.
6. శ్రీహరి:
టాలీవుడ్ లో శ్రీహరికి మంచి నటుడిగా గుర్తింపు ఉంది. శ్రీహరి కొన్ని తెలుగు సినిమాలలో హీరోగా కూడా నటించాడు. షాహిద్ కపూర్ సినిమా ‘ఆర్ రాజ్ కుమార్’ సినిమా షూటింగ్ లో శ్రీహరి పాల్గొన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా కళ్ళుతిరిగడం మొదలయింది శ్రీహరికి. దాంతో, హాస్పిటల్ కి వెంటనే శ్రీహరి వెళ్ళాడు. 2013, అక్టోబర్ 9న శ్రీహరి ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చనిపోయాడు. లివర్ సమస్యతో శ్రీహరి 49 సంవత్సరాలకే చనిపోయాడు. 1987నాటి ‘బ్రహ్మనాయుడు’ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు శ్రీహరి. ఎన్నో సినిమాలలో ప్రతినాయకుడి పాత్రల్లో కూడా నటించాడు శ్రీహరి.
Also Read Top 6 Tollywood Star Dubbing Artists