
Tollywood Stars As Top Brand Endorse
టాలీవుడ్ స్టార్స్ టాప్ బ్రాండ్స్ ఎండోర్స్
Tollywood Celebrities as Top Brand Ambassadors
ఒక ప్రాడక్ట్ సక్సెస్ అవ్వాలంటే, ఆ ప్రాడక్ట్ కి ఎంతో ప్రమోషన్ అవసరముంటుంది. ఆ ప్రమోషన్ సినిమావాళ్లు చేస్తే… ఇక ఆ ప్రాడక్ట్ సామాన్య జనానికి బాగా చేరువయినట్టే. గ్లామర్ ప్రపంచానికి చెందిన తారలు అడ్వర్టైజ్ మెంట్లలో తళుక్కుమనడం ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ఎంచక్కా ఇంట్లోనే బుల్లితెరపైనా, నెట్టింట్లోనూ ప్రసారమయ్యే అడ్వర్టైజ్ మెంట్లలో ప్రేక్షకులు తమకు ఇష్టమైన నటీనటులను చూడవచ్చు. వారు ఎండోర్స్ చేసే ప్రాడక్ట్ గురించి తెలుసుకోవచ్చు. అలా వారిని అభిమానించే ప్రేక్షకులకు అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా మరింత దగ్గరయిన సినిమా తారలు ఎందరో. కొంతమంది తారలు టాప్ బ్రాండ్స్ కు ఎండోర్స్ చేస్తే… మరికొంతమంది తారలు అప్పుడే మార్కెట్లోకి అడుగుపెడుతోన్న ప్రాడక్టులకు ఎండోర్స్ చేశారు.
1. మహేష్ బాబు:
తెలుగు సినిమా పరిశ్రమలోనే అత్యంత పాపులర్ అయిన నటుడు మహేష్ బాబు. ఆయన అభిమానులు ఆయన్ని ‘ప్రిన్స్’గా, ‘సూపర్ స్టార్’ గా గుర్తించారు. ఎన్నో బ్రాండ్స్ కు మహేష్ బాబు అంబాసడర్ గా వ్యవహరించారు. 2007లో థమ్స్ అప్ తో ఐదు సంవత్సరాల ఎండోర్స్ మెంట్ డీల్ కి సంతకం చేశారు మహేష్. మెగాస్టార్ చిరంజీవి స్థానంలో మహేష్ బాబు థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసడర్ గా మారారు. 2012లో అక్షయ్ కుమార్ స్థానంలో మహేష్ బాబు ‘థమ్స్ అప్’కి నేషనల్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించారు. మహేష్ బాబు తన కెరీర్ మొత్తం మీద అనేక బ్రాండ్స్ కు ఎండోర్స్ చేశారు. యూనివర్సల్ మొబైల్ స్టోర్, నవరత్న ఆయిల్, అమృతాంజన్, జొస్ అలుక్కాస్, ఐడియా సెల్యూలర్, సంతూర్ సోప్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, రైన్ బో హాస్పిటల్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, మహీంద్రా ట్రాక్టర్స్, వంటి అనేక బ్రాండ్స్ కు మహేష్ ఎండోర్స్ చేశారు.
2. నాగార్జున:
కింగ్ నాగార్జున… ఈ పేరు చెప్పగానే టాలీవుడ్ ప్రేక్షకులకు నాగార్జున నటించిన ఎన్నో సినిమాలు గుర్తుకొచ్చేస్తాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా టాప్ బ్రాండ్స్ కి ఎండోర్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘కళ్యాణ్ జువెలర్స్’కి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. ఎంఎస్ ధోనితో మహి రేసింగ్ టీం ఇండియాకు కో ఓనర్ గా ఉండేవారు. అలాగే ఇండియన్ బాడ్మింటన్ లీగ్ యొక్క ముంబై మాస్టర్స్ కి కూడా కో ఓనర్ గా ఉండేవారు. స్టార్ నెట్వర్క్ కు మా టీవీని అమ్మే ముందు నాగార్జున ఆ ఛానల్ కు మేజర్ షేర్ హోల్డర్ గా ఉండేవారు. ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్ కి కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు.
3. అనుష్క శెట్టి:
వెండితెరపై తన అందచందాలతోనే కాదు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అనుష్క. ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి అనేక సినిమాలలో తన ప్రదర్శనతో ఆకట్టుకొన్న స్వీటీ ఎన్నో బ్రాండ్లకు ఎండోర్స్ చేసింది. ఇంటెక్స్, ఎంబీఎస్ జువెలర్స్, చెన్నై సిల్క్స్, కోల్గేట్ లకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించారు.
4. తమన్నా:
మిల్కీ బ్యూటీ తమన్నా తన గ్లామర్ తోనే కాకుండా నటనతోటి కూడా తెలుగు ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానాన్ని కల్పించుకున్నారు ఈ మిల్కీ బ్యూటీ. సెల్కొన్ మొబైల్స్, ఫాంటా, చంద్రిక ఆయుర్వేదిక్ సోప్ వంటి పాపులర్ బ్రాండ్స్ కు తమన్నా ఎండోర్స్ చేస్తున్నారు. ఖజానా జువలరీకి కూడా బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. 2015లో జీ తెలుగు ఛానల్ కి బ్రాండ్ అంబాసడర్ గా సంతకాలు చేశారు. 2016లోని భారత ప్రభుత్వం వారి కంపైన్ ‘బేటీ బచావో, బేటీ పడావో’కు బ్రాండ్ అంబాసడర్ అయ్యారు.
5. ప్రభాస్:
‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న హీరో ప్రభాస్. సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ బ్రాండ్ అంబాసడర్ గా ఆయన్ను మార్చింది. ఇండియాలో టాప్ రేటెడ్ ఆటోమొబైల్ కంపెనీ ‘మహీంద్ర అండ్ మహీంద్ర’కు నేషనల్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారు ప్రభాస్. అయితే, ప్రభాస్ సాధారణంగా తరుచూ బ్రాండ్స్ కు ఎండోర్స్ చేయరని ఇండస్ట్రీలో ఓ ప్రచారం ఉంది. Also Read 8 Popular Tollywood Couples