Tollywood Stars Having Craze In Sports Cricket

Tollywood Stars Having Craze In Sports Cricket

క్రికెట్ లోనూ టాలీవుడ్ స్టార్స్ హవా

Tollywood Stars Having Craze In Sports Cricket

సినిమా… దాదాపు ప్రతీ ఒక్కరు ఇష్టపడే ఒక ఎంటర్టైన్మెంట్. క్రికెట్… చాలా మంది ఇష్టపడే ఆట. సినిమా నటీనటులకు అభిమానులు ఎలాగైతే ఉంటారో, క్రికెటర్లకు కూడా అభిమానులు అలాగే ఉంటారు. ఈ రెండు రంగాలకూ మన దేశంలో పాపులారిటీతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. వెండితెరపై నటనతో అభిమానుల్ని అలరించే నటీనటులు, మైదానంలో క్రికెట్ ఆట ఆడితే ఎలా ఉంటుంది? ఎంతో ఎక్జయిటింగ్ గా ఉంటుంది కదా. ఈ ఆలోచనతోనే మొదలయింది ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’. భారత సినిమా ప్రపంచం నుంచి సినిమా యాక్టర్లు తొమ్మిది బృందాలుగా ఏర్పడి క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరిస్తారు. అలా మన టాలీవుడ్ నుంచి కూడా ఇందులో పాల్గొన్న నటీనటులు ఎందరో ఉన్నారు. 

1. అఖిల్ అక్కినేని:
అఖిల్… టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది యంగెస్ట్ యాక్టర్స్. నాగార్జున, అమల చిన్న కుమారుడైన అఖిల్ ఏడాది వయసులోనే ‘సిసింద్రీ’ సినిమాతో చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 2015లో ‘అఖిల్’ సినిమాతో సినిమా పరిశ్రమలోకి లీడ్ యాక్టర్ గా అడుగుపెట్టిన ఈ స్టార్ ఓ మంచి నటుడే కాదు… మంచి క్రికెటర్ కూడా. 2010లో ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’లో పాల్గొని ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డుని సొంతం చేసుకొన్నాడు. అప్పటివరకు అఖిల్ కు ఎంతమందో ఫ్యాన్స్ ఉన్నప్పటికీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొనడంతో అఖిల్ నేషనల్ గా బాగా పాపులర్ అయ్యాడు. అప్పటినుంచి అఖిల్ రెగ్యులర్ గా సీసీఎల్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాడు. 2016లో ‘కెప్టెన్ ఆఫ్ ది టీం’ అయ్యాడు. అన్నట్టు… అఖిల్ ఇంగ్లాండ్ లో క్రికెట్ కి సంబంధించి ట్రైనింగ్ కూడా అందుకున్నాడు.

2. తరుణ్:
తరుణ్… టాలీవుడ్ లో ఒక హ్యాండ్సమ్ యాక్టర్. 1990వ సంవత్సరంలో వచ్చిన ‘మనసు మమత’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు తరుణ్. హీరోగా తరుణ్ మొదటి సినిమా ‘నువ్వే కావాలి’. ఈ సినిమాకి ఓ ఫిలింఫేర్ పురస్కారం కూడా దక్కించుకున్నాడు తరుణ్. తరుణ్ కి క్రికెట్ ఆట అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం అనేక ఇంటర్వ్యూలలో కూడా తరుణ్ ఎన్నోసార్లు చెప్పాడు. ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’లో పాల్గొని క్రికెట్ లో తనకున్న నైపుణ్యాలను అభిమానులకి చూపించాడు.

Tollywood Stars Having Craze In Sports Cricket3. నితిన్:
టాలీవుడ్ లో ఓ ఎనర్జిటిక్ యాక్టర్ గా నితిన్ కి మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. నితిన్ కి కూడా క్రికెట్ ఆట అంటే ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తితో ‘సీసీఎల్’లో చాలా సార్లు పాల్గొని క్రికెట్ లో తన సత్తాని నిరూపించుకున్నాడు నితిన్. వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా బాగా ప్రయత్నించి టాలీవుడ్ లో హిట్ కొట్టిన నితిన్… క్రికెట్ లో తన టాలెంట్ ని బయటపెట్టుకొని మంచి క్రికెటర్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు.

Tollywood Stars Having Craze In Sports Cricket4. రాంచరణ్:
టాలీవుడ్ లో రాంచరణ్ కి మెగా పవర్ స్టార్ గా ఓ ఇమేజ్ ఉంది. ‘చిరుత’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చెర్రీ మెల్లగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. నటుడు, డాన్సర్, నిర్మాత అయిన రాంచరణ్ లో ఓ క్రికెటర్ కూడా ఉన్నాడు. రాంచరణ్ కూడా చాలా సార్లు ‘సిసిఎల్’లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు.

5. సుధీర్ బాబు:
టాలీవుడ్ హీరోల్లో బాగా క్రికెట్ ఆడగలిగే వారి పేరులో హీరో సుధీర్ బాబు పేరు తప్పక చెప్పాలి. వాస్తవానికి సుధీర్ బాబు ఓ ప్రొఫెషనల్ బాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బాడ్మింటన్ ప్లేయర్ గా నెంబర్ వన్ రాంక్ సంపాదించుకున్నాడు. డబుల్స్ పార్టనర్ గా పుల్లెల గోపీచంద్ తో కలిసి ఆడాడు కూడా సుధీర్ బాబు. క్రికెట్ ఆటలో కూడా సుధీర్ కి టచ్ ఉండడంతో ‘సిసిఎల్’లో ఆడి క్రికెట్ కూడా తాను ఆడగలనని నిరూపించుకున్నాడు సుధీర్ బాబు.

Also Read Top Actors Become Producers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here