Top 6 Small Screen Celebrities

Top 6 Small Screen Celebrities

టాప్ 6 తెలుగు స్మాల్ స్క్రీన్ సెలెబ్రిటీస్

Top Telugu Television Celebrities

ప్రస్తుత కాలంలో బుల్లితెరకు కూడా వెండితెరకు ఉన్నంత క్రేజ్ ఉంది. వెండితెరపై కనిపించేవాళ్లకు ఏ స్థాయిలో స్టార్డం ఉందో బుల్లితెరపై కనిపించేవారికి కూడా అదేస్థాయిలో స్టార్డం ఉంది. నేటి కాలంలో బుల్లితెరకు వర్క్ చేస్తున్న వారికి కూడా స్టార్ స్టేటస్ ఉన్నట్లే. కొంతమంది సినిమాల్లో వర్క్ చేసి ఆ తరువాత బుల్లితెరకు వస్తూ ఉంటారు. ఇంకొంతమంది బుల్లితెర ద్వారా పరిచయమయ్యి ఆ తరువాత వెండితెరపై తమ హవా చూపిస్తూ ఉంటారు. ఇక, బుల్లితెరపైకి వర్క్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన వారు ఎందరో ఉన్నారు. 

1. హరితేజ:
బుల్లితెర ప్రేక్షకులకు హరితేజ పేరుకు పరిచయం అక్కరలేదు. పలు సీరియల్స్ లో నటించిన హరితేజ కొన్ని షోస్ కి యాంకరింగ్ కూడా చేసింది. ‘బిగ్ బాస్ 1’లో పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంది హరితేజ. ఆ షోలో ఫైనల్ వీక్ వరకు ఉండి మూడవ స్థానం దక్కించుకొంది హరితేజ. ‘అఆ’లో హరితేజ పోషించిన మంగమ్మ పాత్ర తనకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

Top Telugu Television Celebrities2. సుడిగాలి సుధీర్:
‘జబర్దస్త్’ అనే కామెడీ షో ద్వారా బాగా ఫేమ్ సంపాదించాడు సుడిగాలి సుధీర్. మరోపక్క ‘ఢీ’ అనే డాన్స్ షోకి కూడా కొన్ని సీజన్స్ కి టీం లీడర్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఢీ 13 కింగ్స్ వెర్సస్ క్వీన్స్ కు కూడా టీం లీడర్ గా ఉన్నాడు. ఢీ షోలో సుడిగాలి సుధీర్ ఉండడం వలన షోలో కామెడీ తెగ పండుతోంది. డాన్స్ షో అయినప్పటికీ సుధీర్ ఉండడం వలన ఈ షోకు అదనపు అట్రాక్షన్ జోడైనట్టు ఉంది. మొత్తానికి స్మాల్ స్క్రీన్ లో తన కామెడీ స్కిల్స్ తో పెద్ద పాపులారిటీ సంపాదించేసాడు సుధీర్.

Top Telugu Television Celebrities3. శ్రీముఖి:
బుల్లితెరపై మెరిసే మరొక టాప్ సెలబ్రిటీ శ్రీముఖి. 2012లో ‘జులాయి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీముఖి. ఆ తరువాత ‘నేను శైలజ’, ‘జెంటిల్ మ్యాన్’ ఇంకా కొన్ని సినిమాలలో నటించింది. ఆ తరువాత బుల్లితెరపైన పలు షోస్ కు హోస్ట్ చేసింది. బుల్లితెరపై ‘అదుర్స్’, ‘అదుర్స్ 2’, ‘సూపర్ మామ్’, ‘పటాస్’, ‘సూపర్ సింగర్ 9’, ‘జీ సరిగమప’, వంటి ఎన్నో షోలకు శ్రీముఖి హోస్ట్ చేసింది. ‘బిగ్ బాస్ 3’లో కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేసింది శ్రీముఖి.

Top Telugu Television Celebrities4. యాంకర్ రవి:
‘సంథింగ్ సంథింగ్’ ప్రోగ్రాంతో యాంకర్ రవి కెరీర్ బాగా సక్సెస్ అయ్యింది. ఈ షోని యాంకర్ రవితో పాటు మరో యాంకర్ లాస్య కూడా హోస్ట్ చేసింది. యాంకర్ లాస్య, యాంకర్ రవి ఇద్దరూ కలిసి చాలా షోస్ కి యాంకరింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి ‘ఢీ జోడి’కి కూడా హోస్ట్ చేశారు. కొంతకాలం వీరిద్దరూ కలిసి హోస్ట్ చేయడం మానేశారు. కానీ మళ్ళీ స్టార్ మాలో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ‘ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ’ షోకి తిరిగి కలిసి యాంకరింగ్ చేయడం మొదలుపెట్టారు. ఏదిఏమైనా మొత్తానికి యాంకర్ రవి మాత్రం బుల్లితెర సెలబ్రిటీగా బాగా సక్సెస్ సాధించాడు.

Top Telugu Television Celebrities5. లాస్య మంజునాథ్:
పాపులర్ యాంకర్ లాస్య కూడా స్మాల్ స్క్రీన్ టాప్ సెలబ్రిటీలలో ఒకరు. బుల్లితెరపై పలు షోస్ కు యాంకరింగ్ చేసిన లాస్య ‘బిగ్ బాస్ 4’లో పార్టిసిపేట్ చేసింది. తన యాంకరింగ్ స్కిల్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొంది లాస్య. లాస్య ఎంత పాపులారిటీ సంపాదించిందంటే ఆమె కుమారుడు జున్ను కూడా ఓ చిన్న సెలబ్రిటీ అయిపోయాడు.

Top Telugu Television Celebrities6. హైపర్ ఆది:
తెలుగు బుల్లితెర మరో సెన్సేషన్ హైపర్ ఆది. జబర్దస్త్ షోలో తన స్కిట్స్ తో ప్రజలకు బాగా చేరువయ్యాడు హైపర్ ఆది. హైపర్ ఆది స్కిట్స్ లో ఉండే హాస్యపూరికమైన డైలాగ్స్ ఎంతో హిట్టయ్యాయి. ఈ షో ద్వారా కలిగిన గుర్తింపుతో కొన్ని సినిమాలలో సైతం నటించే అవకాశాన్ని పొందాడు హైపర్ ఆది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘తొలిప్రేమ’, సవ్యసాచి’, ‘వెంకీ మామ’ తదితర సినిమాలలో నటించాడు హైపర్ ఆది. ‘బిగ్ బాస్ 4’కి కూడా గెస్ట్ అప్పీయరెన్సు ఇచ్చాడు ఆది.

Top Telugu Television Celebrities

Also Read Top 7 Tollywood Movies Which Will Remember Historic Moments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here