Top 7 Telugu Anchors Who Have Huge Fans

Top 7 Telugu Anchors Who Have Huge Fans

టాప్ 7 తెలుగు యాంకర్స్

Anchors In Telugu Industry Who Have Huge Fans

ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కాని ఇప్పుడు, బుల్లితెరపై కనిపించే వారికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువవుతోంది. మరీ ముఖ్యంగా టీవీ యాంకర్స్ కు అభిమానులు ఎక్కువయిపోతున్నారు. టీవీలో షోలు, ప్రోగ్రామ్స్ నిర్వహించడం దగ్గర నుంచి సినిమా ఆడియో ఫంక్షన్స్ కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు తెలుగు టీవీ టాప్ యాంకర్స్. అలా… బుల్లితెర ద్వారా అభిమానులని పలకరిస్తున్నారు టీవీ యాంకర్స్. 

1. సుమ:
యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సుమ. ఏ షో చేసినా ఆ షోని ఎంతో ఎనర్జిటిక్ గా ప్రెజెంట్ చేయడం సుమ యొక్క ప్రత్యేకత. సుమ మాతృభాష మలయాళం. అయినప్పటికీ తెలుగు భాషని ఎంతో అనర్గళంగా మాట్లాడడమే కాదు తెలుగులో స్పాంటేనియస్ గా కూడా జోకులు వేయగలదు. దూరదర్శన్ లోని సీరియల్స్ తో సుమ తన కెరీర్ ని ప్రారంభించింది. ప్రస్తుతం సుమకు స్టార్ యాంకర్ అనే గుర్తింపు ఉంది. ‘పట్టుకుంటే పట్టుచీర’, ‘అవాక్కయ్యారా’, ‘జీన్స్’, ‘కెవ్వు కేక’, ‘క్యాష్’ వంటి ప్రోగ్రామ్స్ సుమ యాంకరింగ్ వలన ఎంతో పాపులారిటీ సంపాదించాయి. సుమ వాయిస్ మోడ్యులేషన్ కూడా బాగుంటుంది. ఇంకా సుమ తన హోంలీ లుక్ తో తెలుగు ప్రజలకు బాగా దగ్గరయింది. యాంకర్ అవ్వాలని అనుకునేవారికి సుమ నిజంగా ఓ ఇన్స్పిరేషనే.

Top 7 Telugu Anchors Who Have Huge Fan Following2. అనసూయ:
అనసూయకు కూడా టాప్ టీవీ యాంకర్స్ లో ఒకరిగా గుర్తింపు ఉంది. ‘జబర్దస్త్’ టీవీ షోతో అనసూయకు ఎంతో ఫేమ్ వచ్చింది. అనసూయ మొదట సాక్షి టీవీలో న్యూస్ ప్రెజెంటర్ గా పని చేసింది. తరువాత మా మ్యూజిక్ లో యాంకర్ గా వర్క్ చేసింది. ‘వేదం’, ‘పైసా’ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా వర్క్ చేసింది. అనసూయ సినిమాల్లో కూడా నటించింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘క్షణం’, ‘రంగస్థలం’ సినిమాల్లో కూడా ఈ స్టార్ యాంకర్ నటించింది.

Top 7 Telugu Anchors Who Have Huge Fan Following3. ఉదయభాను:
టీనేజ్ లోనే యాంకరింగ్ లోకి అడుగుపెట్టిన ఉదయభానుకి ‘వన్స్ మోర్ ప్లీజ్’ అనే కార్యక్రమంతో బాగా గుర్తింపు వచ్చింది. ఉదయభానుకు యాంకరింగ్ లో 20 సంవత్సరాల పైగానే అనుభవం ఉంది. అయినప్పటికీ ఉదయభాను యాంకరింగ్ చేసే కార్యక్రమానికి ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్సే వేరు. ‘జాణవులే నెరజాణవులే’, ‘నీ ఇల్లు బంగారం కానూ’, ‘సాహసం చెయ్యరా డింభకా’ ప్రోగ్రామ్స్ ఉదయభానుకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన కొన్ని కార్యక్రమాలు.

Top 7 Telugu Anchors Who Have Huge Fan Following4. ప్రదీప్:
యాంకరింగ్ లో కేవలం ఆడవారే కాదు మొగవారు కూడా సక్సెస్ అవగలరు అని నిరూపించిన యాంకర్… ప్రదీప్. ‘గడసరి అత్త సొగసరి కోడలు’ షో ప్రదీప్ కు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. జీ తెలుగులో ఈ షో ప్రసారమైంది. రేడియో మిర్చీలో రేడియో జాకీగా ప్రదీప్ తన కెరీర్ ని మొదలు పెట్టాడు. ‘అదుర్స్’, ‘నర్తనశాల’, ‘ఎక్ష్ప్రెస్స్ రాజా’, ‘ఢీ’ వంటి ప్రోగ్రామ్స్ తో ప్రదీప్ యాంకర్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ప్రదీప్ హోమ్ ప్రొడక్షన్ లో వచ్చిన ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్త’ కూడా విజయవంతమైంది.

Top 7 Telugu Anchors Who Have Huge Fan Following5. ఓంకార్:
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో యాంకరింగ్ లో విజయం సాధించిన మరొక మేల్ యాంకర్… ఓంకార్. ఓంకార్ హోస్ట్ చేసిన ‘ఆట’, ‘ఛాలెంజ్’, ‘100% లక్’, ‘మాయాద్వీపం’ వంటి షోలు బాగా హిట్టయ్యాయ్యి. ఈ షోల సృష్టికర్త కూడా ఓంకారే. తెలుగు ప్రజలకు రియాలిటీ షోల కాన్సెప్ట్ ని పరిచయం చేసిన వ్యక్తిగా ఓంకార్ కు బాగా గుర్తింపు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్టుల కారణంగా ఓంకార్ హోస్ట్ చేసిన ప్రోగ్రామ్స్ లో దాదాపు అన్నీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి.

Top 7 Telugu Anchors Who Have Huge Fan Following6. రష్మీ గౌతమ్:
అనసూయ స్థానంలో ‘జబర్దస్త్’ షోకి రష్మీ యాంకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ప్రేక్షకాదరణ బాగా ఉన్న యాంకర్స్ లో రష్మీ ఒకరు. ‘సూపర్ కుటుంబం’, ‘రగడ ద అల్టిమేట్ డాన్స్ షో’, ‘అనుభవించు రాజా’ వంటి ఎన్నో కార్యక్రమాలకి రష్మీ యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం రష్మీ యాంకరింగ్ చేస్తోన్న ‘ఎక్స్ట్రా… జబర్దస్త్’ షోకి బాగా పాపులారిటీ ఉంది.

Top 7 Telugu Anchors Who Have Huge Fan Following7. శ్యామల:
యాంకరింగ్ తో గురింపు పొందిన మరొక స్టార్ యాంకర్ శ్యామల. స్క్రీన్ పై ఎంతో డీసెంట్ గా, గోర్జియస్ గా కనిపించే శ్యామల యాంకరింగ్ ని ఇష్టపడే అభిమానులు ఎందరో ఉన్నారు. ‘లక్ష్మి రావే మా ఇంటికి’ షోతో శ్యామల బాగా ఫేమస్ అయింది. టీవీ షోస్ కే కాకుండా, శ్యామల స్టేజి షోస్, ఆడియో లాంచ్, అవార్డ్స్ ఫంక్షన్స్ కు కూడా హోస్ట్ చేసింది.

Top 7 Telugu Anchors Who Have Huge Fan Following

Also Read 5 Comedians Who Will Be Remembered Forever By Telugu Audience

Related post

Leave a Reply

Your email address will not be published.