
Top 7 Tollywood Movies Which Will Remember Historic Moments
చారిత్రక సంఘటనలు గుర్తుచేసే 7 టాలీవుడ్ చిత్రాలు
Top Telugu Historical Movies Which Will Remember
మన దేశ చరిత్రలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. మన దేశ చారిత్రాత్మక సంఘటనలు, ఉద్యమాలు, పోరాటాలు, గొప్పవారి జీవితాలు… సినిమా వాళ్ళను కూడా ఎంతో ఇన్స్పైర్ చేశాయి. వాటి ఆధారంగా కొన్ని సినిమాలు కూడా తెరకెక్కించారు ఫిల్మ్ మేకర్స్.
1. జై బోలో తెలంగాణ:
‘జై బోలో తెలంగాణ’ సినిమా 2011లో తెరకెక్కింది. ఎన్.శంకర్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలంగాణ మూవ్మెంట్ ఆధారంగా రూపొందించారు. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కించారు. జగపతిబాబు, స్మ్రితి ఇరానీ, మీరా నందన్, సందీప్ సింగ్ తదితరులు నటించిన ఈ సినిమాకు దివంగత సంగీతదర్శకుడు చక్రి సంగీతం అందించారు.
2. రక్త చరిత్ర:
2010లో విడుదలైన ‘రక్త చరిత్ర’ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాని పరిటాల రవీంద్ర జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రశాంత్ పాండే రచన అందించిన ఈ సినిమాని రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేశారు. తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాని ఒకేసారి తెరకెక్కించారు. ఇందులో వివేక్ ఒబ్రాయ్, సుదీప్, రాధికా ఆప్టే, కోటశ్రీనివాస్ రావు తదితరులు నటించారు. వివేక్ ఒబ్రాయ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించారు.
3. రుద్రమదేవి:2015లో 3డి బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది ‘రుద్రమదేవి’. డెక్కన్ లోని కాకతీయ రాజవంశం యొక్క ప్రముఖ పాలకులలో ఒకరైన రుద్రమ దేవి జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. భారతదేశ చరిత్రలో ఉన్న అతి తక్కువ రూలింగ్ క్వీన్స్ లో రుద్రమదేవి ఒకరు. ఈ సినిమాకి రచన అందించింది గుణశేఖర్. ఆయన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు కూడా. ఇందులో ‘రుద్రమదేవి’గా అనుష్క శెట్టి నటించారు. అల్లుఅర్జున్, రానాదగ్గుబాటి, కృష్ణన్ రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, నిత్యామీనన్, ఆదిత్య, కాథరిన్ ట్రెసా ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.
4. అల్లూరి సీతారామరాజు:
స్వాతంత్ర యోధుడు అల్లూరి సీతారామరాజుపై తెరకెక్కిన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. 1974లో తెరకెక్కిన ఈ సినిమాకి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించింది మహారథి త్రిపురనేని. కృష్ణ, విజయనిర్మల, జగయ్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. పద్మాలయ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం కృష్ణ నటించిన వందవ సినిమా.
5. బెజవాడ:
నాగచైతన్య, అమలాపాల్ జంటగా నటించిన ఈ సినిమాని రాంగోపాల్ వర్మ నిర్మించారు. ఈ సినిమాకి వివేక్ కృష్ణ దర్శకత్వం వహించారు. విజయవాడ గ్యాంగ్ వార్ ఫేర్ ఆధారంగా ఈ చిత్రం యాక్షన్ క్రైమ్ సినిమాగా తెరకెక్కింది. ఇది హిందీలో ‘హీరో: ద యాక్షన్ మ్యాన్’గా తమిళ్లో ‘విక్రమ్ దాదా’గా డబ్ అయింది. ‘బెజవాడ’ సినిమా విజయం బాక్సాఫీసు వద్ద ఎలా ఉన్నా టెలివిజన్ లో మాత్రం ఈ సినిమాని పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు.
6. భక్త కన్నప్ప:
ఈ భక్తిరస ప్రధాన సినిమా 1976వనాటిది. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, వాణిశ్రీ, ముఖ్యపాత్రల్లో నటించారు. శివ భక్తుడు ‘కన్నప్ప నయనర్’ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని కీలకమైన భాగం కన్నప్ప. ఈ చిత్రం షూటింగ్ పట్టిసీమ, గూటాల, బుట్టాయగూడెం తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.
7. బొబ్బిలి యుద్ధం:
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ‘బొబ్బిలి యుద్ధం’ ఒక కీలకమైన ఘట్టంగా పేరుగాంచింది. 1757వ సంవత్సరంలో విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి, బొబ్బిలి సంస్థాన సైన్యానికి మధ్య ఓ యుద్ధం జరిగింది. ఈ యుద్ధమే ‘బొబ్బిలి యుద్ధం’. ఈ యుద్ధం ఆధారంగా 1964లో ‘బొబ్బిలి యుద్ధం’ సినిమా తెరకెక్కింది. సి.సీతారాం నిర్మించీ, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీ రామారావు, భానుమతి రామకృష్ణ, ఎస్వీ. రంగారావు ఇతరులు ముఖ్యపాత్రల్లో నటించారు. సాలూరి రాజేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Also Read: Remuneration Of Tollywood Actress