
Top Telugu Serials Which Continued For Many Years
ఏళ్లపాటు సాగిన 6 తెలుగు సీరియల్స్
Long Running Telugu Serials
బుల్లితెరపై ప్రసారమయ్యే వాటిలో సీరియల్స్ కు ఉండే ఆదరణే వేరు. ఒక సీరియల్ కి ప్రేక్షకులు అలవాటు పడితే చాలు, కరెక్ట్ గా ఆ సీరియల్ స్టార్టయ్యే సమయానికి టీవీ ముందు వచ్చి కూర్చుంటారు. సీరియల్ ముగిసేవరకు మధ్యలో ప్రకటనలు వచ్చినా… ఛానల్ ను మార్చడానికి కూడా అంగీకరించని ప్రేక్షకులు ఉన్నారంటే అతి అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ పుణ్యమా అనీ… యూట్యూబ్ లో కొన్ని సీరియల్స్ ప్రసారమవడం, అందులో కూడా ప్రేక్షకులు సీరియల్స్ ని ఫాలో అవడం జరుగుతున్నాయి. మొత్తానికి కొన్ని సీరియల్స్ మాత్రం సక్సెస్ ఫుల్ గా సంవత్సరాల కొద్దీ టెలికాస్ట్ అవుతున్నాయి. ఫాలోయింగ్ ఉండడంతో సీరియల్స్ వేలల్లో ఎపిసోడ్స్ తో ముందుకు దూసుకుపోతున్నాయి, దూసుకుపోయాయి.
1. ఆడదే ఆధారం:
ఈటీవీలో ‘ఆడదే ఆధారం’ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాన సమయాలలో ప్రసారమయ్యేది. 2009 జనవరి 26న ఈ సీరియల్ ప్రారంభమయింది. 2020 మార్చి 14న ఈ సీరియల్ అయిపొయింది. మొత్తం పదకండు సంవత్సరాల పాటు ఈ ధారావాహిక ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. 3,329 ఎపిసోడ్స్ లో ఈ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ ‘అమృత’ అనే ఓ మహిళ చుట్టూ తిరుగుతోంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటినీ ఎంతో ధైర్యంతో, వ్యక్తిత్వంతో ఎదురుకుటుంది అమృత. ఈ క్రమంలో నీతీనియమాలను కూడా ఎక్కడా విచిపెట్టదు. మహిళా ప్రాధాన్యతతో సాగిన ఈ కథ ఎంతోమంది మహిళలకు బాగా చేరువయింది.
2. అభిషేకం:
బుల్లితెరపై ప్రేక్షకులను ఆదరిస్తోన్న మరొక సీరియల్ ‘అభిషేకం’. 2008 డిసెంబర్ 22న ఈ సీరియల్ ప్రారంభమయింది. ఈ సీరియల్ కూడా లాంగెస్ట్ రన్నింగ్ ఇండియన్ టెలివిజన్ సోప్ ఓపెరాగా గుర్తింపు పొందింది. ఈ సీరియల్ కుటుంబ బంధాలు, మానవ విలువుల చుట్టూ తిరుగుతుంది. ఈ ధారావాహిక సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాన సమయాలలో ప్రసారమవుతోంది. ఇప్పటివరకు 3800 పైగానే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. 27 మార్చి 2020 నుంచి ఈ సీరియల్ కరోనా కారణంగా టెలికాస్ట్ అవడం ఆగిపోయింది. ఆ తరువాత మళ్ళీ మూడు నెలల తరువాత జూన్ 22, 2020 నుంచి టెలికాస్ట్ అవడం మొదలయింది. ఈ సీరియల్ ని సౌభాగ్య మీడియా లిమిటెడ్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో నటించిన చాలా మంది నటీనటులకు ఈ సీరియల్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
3. మనసు మమత:
ఈటీవిలో కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోన్న మరొక సీరియల్ ‘మనసు మమత’. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30కు ప్రసారమవుతోన్న ఈ సీరియల్ 2011లో టెలికాస్ట్ అవడం ప్రారంభమయింది. 3,190 పైగానే ఈ సీరియల్ ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సీరియల్ ను నిర్మిస్తున్నారు. అనీల్ కుమార్ ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.
4. స్వాతి చినుకులు:
ఏడు సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరించిన మరొక ధారావాహిక ‘స్వాతి చినుకులు’. ఈ సీరియల్ కూడా ఈటీవీలోనే ప్రసారమయ్యేది. 9 సెప్టెంబర్ 2013 నుంచి 19 సెప్టెంబర్ 2020 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది. ఈ సీరియల్ మొత్తం 2126 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొంది. మైథిలి, నీలవేణి అనే పాత్రల చుట్టూ ఈ సీరియల్ నడిచింది. నటీమణులు రచన ‘నీలవేణి’గా, నేహా గౌడ ‘మైథిలి’ పాత్రలు పోషించారు. వీరిద్దరి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి అనుభూతులు ఏమిటి అన్నది ఈ సీరియల్ ప్రధానాంశం. ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
5. మొగలిరేకులు:
జెమినీ టీవీలో ప్రసారమయిన ‘మొగలిరేకులు’ సీరియల్ కూడా ఐదేళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ కు ఎంతో ఆదరణ ఉండడంతో జెమినీ టీవీలోనే ఈ సీరియల్ మళ్ళీ టెలికాస్ట్ అయింది. మంజులనాయుడు ఈ సీరియల్ కు దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ లో ముఖ్య తారాగణంగా సాగర్, షీలా, లిఖిత కామిని, ఇంద్రనీల్ తదితరులు నటించారు. ఈ సిరియల్లోని ట్విస్టులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
6. అగ్నిపూలు:
ఈ సీరియల్ జెమినీ టీవీలో ప్రసారమైంది. ఈ సీరియల్ కూడా కొన్ని సంవత్సరాల పాటు టెలికాస్ట్ అయ్యి ప్రేక్షకులను బాగా అలరించింది. 2012 ఆగష్టు 13న ప్రారంభమయిన ఈ సీరియల్ 2017 ఆగష్టు 25న ముగిసింది. యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సీరియల్ కు మంజుల నాయుడు దర్శకత్వం వహించారు. రెండు సీజన్స్ లో ప్రసారమయిన ఈ సీరియల్ మొత్తంగా 1326 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొంది. సుధాకర్ పల్లమాల, శశాంక్ పల్లమాల ఈ సీరియల్ ను నిర్మించారు.
Also Read: Remuneration Of Tollywood Actress