Unknown Facts About Actress Keerthy Suresh

Unknown Facts About Actress Keerthy Suresh

కీర్తిసురేష్ కి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా

Unknown Facts About Actress Keerthy Suresh

కీర్తి సురేష్… ‘నేను శైలజ’తో టాలీవుడ్ ని పలకరించిన హీరోయిన్. ఆ సినిమా తరువాత ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’ తదితర మూవీస్ లో నటించి ప్రేక్షకులకు చేరువయింది. ఆ తరువాత రిలీజ్ అయిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారిగా బాగా దగ్గరయిపోయింది కీర్తి. దాంతో ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 

1. బాల్యంలోనే తెరముందుకు:
కీర్తి సురేష్ మన టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమయినా… మోలీవుడ్ కి మాత్రం చైల్డ్ యాక్టర్ గానే ఎంట్రీ ఇచ్చింది. ‘పైలట్’, ‘అచనయికిస్టం’, ‘కుబేరన్’ అనే మలయాళ సినిమాల్లో బాల్యనటిగా నటించింది. ‘కుబేరన్’ సినిమాలో కీర్తి పాత్ర ప్రాముఖ్యమున్నదే. ఈ సినిమాలను కీర్తి తల్లి మేనకే నిర్మించింది.Unknown Facts About Actress Keerthy Suresh2. తల్లి వారసత్వం:
కీర్తిసురేష్ తల్లి మేనక కూడా ఒక నటే. తండ్రి సురేష్ కుమార్ సినిమా నిర్మాత. మన తెలుగులో మేనక, చిరంజీవితో కలిసి ‘పున్నమి నాగు’ సినిమాలో నటించింది. ఆరు సంవత్సరాల కెరీర్ లో మేనక సుమారు 116 సినిమాల్లో నటించింది. అయితే ఎక్కువగా మలయాళంలోనే నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా మేనక నటించింది.

Unknown Facts About Actress Keerthy Suresh3. రేవతి సురేష్:
కీర్తి సురేష్ అక్క పేరు రేవతి సురేష్. వృత్తి రిత్యా రేవతి వీఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లో రేవతి పని చేసింది.

Unknown Facts About Actress Keerthy Suresh4. ముందు చదువు, ఆ తరువాతే నటన:
కీర్తీకి చిన్నతనం నుంచి నటి అవ్వాలని ఉన్నప్పటికీ… ఆమె తల్లిదండ్రులు చదువు విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఒక స్థాయిలో చదువుకున్న తరువాతే ఈ రంగంవైపుగా రావాలని వారు ఎప్పుడు భావించేవారు. దాంతో, కీర్తి కూడా చదువుకున్న తరువాతే ఇండస్ట్రీకి అడుగుపెట్టారు.

Unknown Facts About Actress Keerthy Suresh5. ఫ్యాషన్ డిజైనర్:
కీర్తి ఫ్యాషన్ సెన్స్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆడియో ఫంక్షన్స్, ఈవెంట్స్ లో కీర్తి వేసుకునే ఫ్యాషన్ దుస్తులు అభిమానుల్ని ఎంతగానో అట్ట్రాక్ట్ చేస్తుంటాయి. ఇంత ఫ్యాషన్ సెన్స్ కీర్తికి ఎలా వచ్చిందో తెలుసా? స్వయంగా కీర్తే ఓ ఫాషన్ డిజైనర్ అవడం వల్ల. కీర్తి సురేషే చెన్నైలోని పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైన్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత స్కాట్ ల్యాండ్ లో డిజైనింగ్ కోర్స్ చేసింది. ఆ తరువాత లండన్ లో ఫ్యాషన్ డిజైనింగ్ మీదనే ఇంటర్న్షిప్ కూడా చేసింది. కొన్నిసార్లు కొన్ని అకేషన్స్ కి తన అవుట్ ఫిట్ ని తానే డిజైన్ చేసుకునేది.

Unknown Facts About Actress Keerthy Suresh6. ఈతలోనూ ఫస్టే:
ఈ అందాల ‘మహానటి’ ఈతలోనూ ఫస్టే. స్కూల్ డేస్ లో కీర్తి బ్రహ్మాండంగా ఈత కొట్టేది. వాస్తవానికి స్కూల్ లో స్విమ్మింగ్ లో ఛాంపియన్ గా ఉండేది. ఇలా ఛాంపియన్ అవడానికి కీర్తి ఎంతో కఠినంగా శ్రమించేది.

Unknown Facts About Actress Keerthy Suresh7.ఆరోగ్యంపై శ్రద్ధ:
సినిమా పరిశ్రమలో విజయ పతాకం ఎగురవేస్తోన్న కీర్తిసురేష్ కు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. దాంతో, పూర్తి శాకహార భోజనానికి ప్రాధాన్యతను ఇస్తుంది కీర్తి. అంతేకాదు, కీర్తి డైలీ రొటీన్ లో యోగా కూడా భాగమే. క్రమం తప్పకుండా యోగా చేయాల్సిందే. సో, పూర్తి శాఖాహార భోజనం, యోగా అనేవి కీర్తి అందం యొక్క సౌందర్య రహస్యాలు అన్నమాట.

Unknown Facts About Actress Keerthy Suresh8. బుల్లితెరపై కూడా:
హీరోయిన్ గా తెరకు ఆరెంగేట్రం ఇచ్చే ముందు కీర్తి మలయాళ సినిమాల్లో బాల్య నటిగా నటించడమే కాదు, సీరియల్స్లో కూడా చేసిందండోయ్. మలయాళంలో ‘సంతాన గోపాలం’ అనే టెలివిజన్ సీరియల్ లో చైల్డ్ యాక్ట్రెస్ గా చేసింది. ఈ సీరియల్ సూర్య టీవీలో ప్రసారం అయింది. ఆ తరువాత ‘కృష్ణ కృప సాగరం’ అనే మరో మలయాళ సీరియల్ లో నటించి మలయాళీ ప్రేక్షకులను మరింత ఆకట్టుకొంది.

Unknown Facts About Actress Keerthy Suresh9. హీరో విజయ్ అభిమాని:
కీర్తి సురేష్ హీరో విజయ్ కు పెద్ద అభిమాని. ఇలయథలపతి విజయ్ అంటే తనకు చిన్నతనం నుంచి ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ హీరోయిన్. విజయ్ తో ఇప్పటికే ‘ఏజంట్ భైరవ’, ‘సర్కార్’ సినిమాలలో స్క్రీన్ ని షేర్ చేసుకొంది ఈ బ్యూటీ. తనకు నచ్చిన హీరోతో కలిసి నటించింది.

Unknown Facts About Actress Keerthy Suresh

Also Read: Bahubali “The Behind Scenes” Liked By Audience

Related post

Leave a Reply

Your email address will not be published.